5-11 మధ్య వయస్సు గల పిల్లల వ్యాక్సినేషన్ విషయంపై అమెరికా ఎఫ్డీఏ(ఆహార, ఔషధ సంస్థ) కీలక ప్రకటన చేసింది(fda latest news). ప్రాథమిక పాఠశాల విద్యార్థుల్లో వ్యాధి సోకకుండా ఫైజర్ టీకా(us fda pfizer) సమర్థవంతంగా పనిచేస్తోందని స్పష్టం చేసింది. పిల్లలకు టీకా పంపిణీ చేయాలని అగ్రరాజ్యం భావిస్తున్న తరుణంలో ఎఫ్డీఏ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఊరటనిచ్చే విషయం.
అమెరికాలో 5-11ఏళ్ల వయస్సు గల పిల్లలు సుమారు 28మిలియన్ మంది ఉన్నారు(kids vaccine news). వారికి ఇచ్చేందుకు టీకాలు సిద్ధమేనా? అన్న అంశంపై వచ్చే వారంలో ఎఫ్డీఏ ఆధ్వర్యంలో బహిరంగ చర్చ జరగనుంది. ఈ తరుణంలో ఫైజర్ ఇచ్చిన డేటాను విశ్లేషించి, ఆ వివరాలను విడుదల చేసింది ఎఫ్డీఏ.
ఏ పరిస్థితుల్లోనైనా.. చిన్నారులకు టీకా ద్వారా కలిగే సైడ్ఎఫెక్ట్ల కన్నా, వ్యాక్సిన్ చేసే మంచే ఎక్కువగా ఉందని ఎఫ్డీఏ శాస్త్రవేత్తలు నిర్ధరించారు. కొవిడ్ సోకిన చిన్నారులు టీకా తీసుకుంటే చాలా సందర్భాల్లో ఆసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితి రాదని, మరణం నుంచి కూడా రక్షణ లభిస్తుంది అభిప్రాయపడ్డారు.
శాస్త్రవేత్తలు ఇంత సానుకూలంగా ఉన్నా.. 5-11 మధ్య వయస్సు(pfizer kids vaccine) గల చిన్నారులకు టీకా ఇచ్చేందుకు ఎఫ్డీఏ ఇంకా అనుమతులు ఇవ్వలేదు. మంగళవారం జరగనున్న సమావేశంలో స్వతంత్ర సలహాదారులు కూడిన ప్యానెల్ ఈ వ్యవహారంపై చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటుంది. ఆ తర్వాత ఎఫ్డీఏ తుది నిర్ణయానికొస్తుంది.
ఒకవేళ ఎఫ్డీఏ అనుమతులిస్తే.. నవంబర్ తొలి వారం నుంచి చిన్నారులకు టీకా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. 12 అంతకుమించిన వయస్సు వారికి ఇప్పటికే ఫైజర్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. అంతకన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లల తల్లిదండ్రులు టీకా వార్త కోసం ఎదురుచూస్తున్నారు. డెల్టా వేరియంట్ నుంచి తమ పిల్లలను రక్షించాలని, తద్వారా వారిని స్కూళ్లకు పంపించవచ్చని ఆశిస్తున్నారు.
రెండు డోసుల టీకాతో పిల్లలకు 91శాతం సామర్థ్యం లభిస్తుందని, వారిలో లక్షణాలున్న వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని ఫైజర్ ఓ డేటాను విడుదల చేసింది. ఓవైపు వైరస్ సోకిన 16మంది చిన్నారులపై డమ్మీ టీకా ప్రయోగించి, మరోవైపు టీకా తీసుకున్నా కొవిడ్ బారినపడిన ముగ్గురు చిన్నారులపై ఈ పరిశోధనలు చేశారు. టీకా తీసుకున్న కొవిడ్ బారిన పడిన ముగ్గురు పిల్లలపై ఈ పరిశోధన జరిగింది. పిల్లల్లో తీవ్ర అనారోగ్య సమస్య కనిపించలేదు కానీ టీకా తీసుకోని వారితో పోల్చితే వ్యాక్సిన్లు తీసుకున్న చిన్నారుల్లో లక్షణాల తీవ్రత తక్కువగా ఉందని తేలింది.
ఇదీ చూడండి:-6 నెలల తర్వాత 80 శాతం యాంటీబాడీలు మాయం!