టీకా పంపిణీలో అమెరికా మరో కీలక ముందడుగు వేసింది. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుల కోసం ప్రముఖ టీకా తయారీ సంస్థ ఫైజర్ (Pfizer Kids Vaccine Approval) రూపొందించిన టీకాకు ఆమోదం లభించింది. అత్యవసర వినియోగం కింద ఈ టీకాల పంపిణీకి అనుమతిస్తున్నట్లు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మనిస్ట్రేషన్ (Pfizer Kids Vaccine Approval) ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ టీకా పంపిణీపై నిపుణులు సూచనలను పరిశీలించి సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ మంగళవారం తుది ప్రకటన చేయనుంది.
చిన్నారులకు మూడు వారాల వ్యవధిలో రెండు డోసులు (Pfizer Kids Vaccine Approval) ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ టీకాలు అందుబాటులోకి వస్తే దేశంలోని 2.8 కోట్ల మంది చిన్నారులు లబ్ధిపొందనున్నారు.