తెలంగాణ

telangana

ETV Bharat / international

'బైడెన్​ ప్రమాణస్వీకారం రోజు అమెరికాలో అల్లర్లు!'

జనవరి 20న అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం నేపథ్యంలో అగ్రరాజ్యంలో అల్లర్లు జరిగే అవకాశముందని అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ(ఎఫ్​బీఐ) హెచ్చరించింది. ట్రంప్​ మద్దతుదారులు ఆయుధాలతో అల్లర్లకు పాల్పడేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు పేర్కొంది.

FBI warns armed protest in US capitol
ఆ రోజు అమెరికాలో అల్లర్లు జరగనున్నాయి:ఎఫ్​బీఐ

By

Published : Jan 12, 2021, 3:41 PM IST

జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా డెమొక్రాట్ నేత జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో అగ్రరాజ్యంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ(ఎఫ్​బీఐ) హెచ్చరించింది. అమెరికాలోని 50 రాష్ట్రాల రాజధానుల్లో, వాషింగ్టన్​ డీసీలో నిరసనకారులు ఆయుధాలతో అల్లర్లకు పాల్పడే అవకాశముందని పేర్కొంది. ట్రంప్ మద్దతుదారులు పెద్ద ఎత్తున అల్లర్లకు వ్యూహాలు రచిస్తున్నారని నిఘా వర్గాలు సమాచారం అందించినట్లు తెలిపింది.

"అమెరికాలోని పలు ప్రాంతాల్లో జనవరి 16-20 వరకు నిరసనకారులు ఆయుధాలతో అల్లర్లకు దిగేందుకు యోచిస్తున్నారు. జనవరి 17 నుంచి 20 వరకు క్యాపిటల్​ ప్రాంతంలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిపేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం." అని ఫెడరల్​ బ్యూరో పేర్కొంది.

ఈ నేపథ్యంలో.. క్యాపిటల్ హిల్​ ​భవనం వద్ద అమెరికా అధ్యక్షుడిగా నిర్భయంగా ప్రమాణ స్వీకారం చేస్తానని బైడెన్ తెలిపారు. జనవరి 20న 46వ అమెరికా అధ్యక్షుడిగా బైడెన్​ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.

ఇదీ చదవండి:ట్రంప్​ ఎఫెక్ట్​: సోషల్ మీడియా సంస్థలు నష్టాల్లోకి..

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details