వీగర్ ముస్లింలపై నిఘా కోసం చైనా హ్యాకర్ల రహస్య ఆపరేషన్‌ను బట్టబయలు చేసింది ఫేస్బుక్. నకీలీ ఖాతాలు, వెబ్సైట్ల ద్వారా గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు బుధవారం తెలిపింది.
చైనాలోని షిన్జియాంగ్కు చెందిన వీగర్ కార్యకర్తలు, జర్నలిస్టులు, అసమ్మతివాదులు సహా టర్కీ, కజికిస్థాన్, అమెరికా, సిరియా, ఆస్ట్రేలియా, కెనడాతో పాటు ఇతర దేశాల్లో నివసించే వ్యక్తులను హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నట్లు ఫేస్బుక్ తెలిపింది. ఇప్పటివరకు 500 మంది వరకు వారి బారిన పడినట్లు వెల్లడించింది.
ఎలా జరుగుతోంది?
వీగర్లను ఆకర్షించేలా మోసపూరిత వెబ్సైట్లు, యాప్‌లు, పాత్రికేయులు, కార్యకర్తల పేర్లపై నకిలీ ఫేస్బుక్ ఖాతాలను సృష్టిస్తారు హ్యాకర్లు. వాళ్లలో విశ్వాసం సంపాదిస్తారు. అనంతరం ఆయా ఖాతాల నుంచి మోసపూరిత లింక్‌లను పంపించి వాటిని క్లిక్ చేసేలా ప్రేరేపిస్తారు. తద్వారా వారి ఫోన్లు, కంప్యూటర్లలోకి చొరబడి నిఘా పెడతారు.
ఎవరు చేయిస్తున్నారు?
హ్యాకర్లకు, చైనాలోని రెండు సాంకేతిక సంస్థలకు సంబంధమున్నట్లు ఫేస్బుక్ గుర్తించింది. అయితే వారికి, చైనా ప్రభుత్వానికి నేరుగా సంబంధమున్నట్లు గుర్తించలేదని తెలిపింది ఫేస్బుక్. వీగర్లను అణచివేతకు గురి చేస్తోందన్న ఆరోపణలపై చైనా తీవ్రవిమర్శలను ఎదుర్కొంటోంది.
ఇదీ చూడండి:ఉగ్రవాది అరెస్టు- చైనా తుపాకులు స్వాధీనం