అమెరికన్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. మరోసారి కొవిడ్-19 ఉద్ధృతి కొనసాగే ప్రమాదముందని హెచ్చరించారు ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు డాక్డర్ ఆంటోనీ ఫౌచీ. వైరస్ నివారణకు కీలక సూచనలు చేశారు.
"మరిన్ని వైరస్ కేసులు, ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య, మరణాలను నిరోధించాలంటే రెండు కీలక మార్గాలున్నాయి. వాటిల్లో ఒకటి.. ప్రజారోగ్య చర్యలను మెరుగుపర్చటం. రెండు.. వీలైనంత మందికి వీలైనంత త్వరగా టీకాలు వేయడం."