తెలంగాణ

telangana

ETV Bharat / international

రూ. 23 వేల కోట్ల మాత్రలతో కరోనాకు చెక్​! - dr fauci latest on covid

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనాతో పాటు పలు ప్రమాదకర వైరస్​లను ఎదుర్కొనే దిశగా అగ్రరాజ్యం అడుగులు వేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ప్రాజెక్ట్​ను చేపట్టింది. దీనికోసం సుమారు రూ. 23,745 కోట్లను కేటాయించనున్నట్లు ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డా. ఆంటోని ఫౌచీ తెలిపారు.

Fauci
ఆంటోని ఫౌచి

By

Published : Jun 18, 2021, 8:47 AM IST

ప్రాణాంతక కరోనాతో పాటు ఇతర ప్రమాదకర వైరస్‌ రకాలను సమర్థంగా నిరోధించే మాత్రల (పిల్స్‌) తయారీకి అమెరికా సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టు కోసం రూ.23,745 కోట్లను (3.2 బిలియన్‌ డాలర్లు) కేటాయించనున్నట్లు ఆ దేశ అంటువ్యాధుల నిపుణుడు డా.ఆంటోనీ ఫౌచీ గురువారం వెల్లడించారు.

ప్రమాదకర వైరస్‌ లక్షణాలు కనిపించిన వెంటనే వినియోగించుకునేందుకు ఈ మాత్రలు ఉపయోగపడతాయని, ఈ ఏడాది చివరికి అందుబాటులోకి వస్తాయని శ్వేతసౌధం వద్ద నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన తెలిపారు.

ఇదీ చూడండి:రెండు వేర్వేరు టీకా డోసులు కలపొచ్చా?

ABOUT THE AUTHOR

...view details