తెలంగాణ

telangana

ETV Bharat / international

'డబ్ల్యూహెచ్​ఓకు బైడెన్ పూర్తి​ మద్దతు' - డబ్ల్యూహెచ్​ఓ అమెరికా

డబ్ల్యూహెచ్​ఓకు అన్ని విధాలుగా అమెరికా సహాయపడుతుందని బైడెన్​ ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వైద్య సలహాదారు ఆంటోనీ ఫౌచీ వెల్లడించారు. సంస్థకు ఆర్థికంగా అగ్రరాజ్యం మద్దతిస్తుందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్​ బోర్డు సభ్యులతో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

Fauci lays out Biden's support for WHO after Trump criticism
'డబ్ల్యూహెచ్​ఓకు బైడెన్​ మద్దతు లభిస్తుంది'

By

Published : Jan 21, 2021, 4:31 PM IST

ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా మద్దతుగా నిలుస్తుందని అధ్యక్షుడు జో బైడెన్​ బృందంలోని ఉన్నతస్థాయి వైద్య సలహాదారు, ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ ప్రకటించారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. డబ్ల్యూహెచ్​ఓపై కఠినంగా వ్యవహరించిన నేపథ్యంలో ఫౌచీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

డబ్ల్యూహెచ్​ఓ ఎగ్జిక్యూటివ్​ బోర్డు సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్​లో పాల్గొన్నారు ఫౌచీ. వ్యాక్సినేషన్​ కోసం ఆరోగ్య సంస్థ చేస్తున్న కృషికి బైడెన్​ ప్రభుత్వం సహాయం చేస్తుందన్నారు ఫౌచీ. అదే సమయంలో ఆరోగ్య సంస్థకు పూర్తిస్థాయి నిధులు, సిబ్బందిని అగ్రరాజ్యం అందిస్తుందని స్పష్టం చేశారు.

"డబ్ల్యూహెచ్​లో సభ్యదేశంగా అమెరికా కొనసాగుతుందని చెప్పడానికి నాకు ఎంతో గర్వంగా ఉంది. మునుపటి పరిస్థితులను మార్చి, డబ్ల్యూహెచ్​ఓకు సహాయం చేస్తాం. సంస్థకు ఆర్థికపరంగానూ మద్దతుగా నిలవాలని అమెరికా యోచిస్తోంది."

--- ఆంటోనీ ఫౌచీ, అమెరికా అంటువ్యాధుల నిపుణులు.

అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా వైదొలిగే ప్రక్రియను నిలిపివేసే ఆదేశంపై బైడెన్ సంతకం చేశారు.

కరోనా వైరస్​ నేపథ్యంలో ఆరోగ్య సంస్థ పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. డబ్ల్యూహెచ్​ఓ నుంచి వైదొలుగుతున్నట్టు గతేడాది ప్రకటించారు ట్రంప్​.

ఇదీ చూడండి:-'చైనా ముప్పుతో భారత్​- అమెరికా మైత్రి బలోపేతం'

ABOUT THE AUTHOR

...view details