తెలంగాణ

telangana

ETV Bharat / international

వారెవ్వా! 18 సెకన్లలో.. 2 లీటర్ల కూల్‌డ్రింక్‌ తాగేశాడు! - 2లీటర్ల కూల్‌డ్రింక్‌ 18 సెకన్లలో

2 లీటర్ల కూల్​డ్రింక్ 18 సెకన్లలో ఎవరైనా తాగుతారా? అసాధ్యం కదూ.. కానీ దీన్ని సుసాధ్యం చేసి చూపాడు అమెరికాకు చెందిన ఎరిక్‌ బాడ్‌లాండ్స్‌ బూకర్‌. కేవలం 18 సెకన్లలో 2 లీటర్ల కూల్​డ్రింక్ తాగి ప్రఖ్యాత గిన్నిస్ వరల్డ్ రికార్డ్​లో చోటు సాధించాడు.

booker
ఎరిక్‌ బాడ్‌లాండ్స్‌ బూకర్‌

By

Published : Jul 18, 2021, 4:32 AM IST

Updated : Jul 18, 2021, 6:29 AM IST

మనకు అత్యంత ఇష్టమైన పానీయం ఏదైనా లీటరు తాగాలంటేనే కిందామీదా పడిపోతాం. అలాంటిది రెండు లీటర్ల కూల్‌డ్రింక్‌ సెకన్ల వ్యవధిలో తాగడమంటే మాటలా..! అమెరికాకు చెందిన ఎరిక్‌ బాడ్‌లాండ్స్‌ బూకర్‌ అనే వ్యక్తి కూల్‌డ్రింక్‌ను అత్యంత వేగంగా తాగి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. రెండు లీటర్ల కూల్‌డ్రింక్‌ను కేవలం 18.45 సెకన్లలోనే గుక్క తిప్పుకోకుండా తాగేసి అందరినీ ఔరా అనిపించాడు.

తరచూ ఈటింగ్‌, ర్యాపర్‌ పోటీల్లో పాల్గొనే ఎరిక్‌ యూట్యూబర్‌ కూడా. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్ట్స్‌ టైటిల్‌ సాధించాలనేది అతడి కల. దీంతో మే 19న న్యూయార్క్‌లోని సెల్డన్‌లో జరిగిన పోటీల్లో అత్యంత వేగంగా కూల్‌డ్రింక్‌ తాగే పోటీల్లో పాల్గొన్నాడు.

కూల్​డ్రింక్​తో బూకర్

ఒక పాత్రలో పోసిన 2 లీటర్ల కూల్‌డ్రింక్‌ను గడగడా తాగేసి ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు ఎరిక్‌.

ఇదీ చదవండి :పాక్​లోని అఫ్గాన్​ రాయబారి కూతురిపై దాడి

Last Updated : Jul 18, 2021, 6:29 AM IST

ABOUT THE AUTHOR

...view details