అప్పటివరకు ర్యాంప్‌పై నడుస్తూ అందరినీ అలరించాడు మోడల్ టేల్స్ సోర్స్. తన నడకతో ఆకట్టుకున్నాడు. ఉన్నట్టుండి ఒక్కసారిగా ర్యాంప్‌పైనే కుప్పకూలిపోయాడు. బ్రెజిల్‌లోని సావోపోలోలో జరిగిన ఫ్యాషన్ షోలో ఈ ఘటన జరిగింది.
క్యాట్‌వాక్ చేస్తూ పడిపోయాడు.. ప్రాణాలు వదిలాడు - show
బ్రెజిల్ సావోపోలో ఫ్యాషన్ షోలో ఓ మోడల్ ర్యాంప్‌పైనే కుప్పకూలిపోయాడు. అనంతరం ఆసుపత్రికి తరలించారు నిర్వాహకులు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు.
ఫ్యాషన్ షో
నాలుగు రోజులుగా జరుగుతున్న ఫ్యాషన్ షోకు టేల్స్ సోర్స్ హాజరయ్యాడు. ఫ్యాషన్ షోలో శనివారం క్యాట్ వాక్ చేస్తూ పడిపోయాడు. స్పృహా కోల్పోయిన అతడిని ఆసుపత్రికి వెంటనే తరలించారు నిర్వాహకులు. చికిత్స పొందుతూ అక్కడే మరణించాడు టేల్స్ సోర్స్.
షూ లేస్ తట్టుకుని సోర్స్ ర్యాంప్‌పై పడిపోయినట్టు అక్కడి మీడియా తెలిపింది. ఫ్యాషన్ షోను తిలకిస్తున్న ప్రేక్షకులు మాత్రం ప్రదర్శనలో భాగంగా సోర్స్ పడిపోయాడని భావించారు.