తెలంగాణ

telangana

ETV Bharat / international

మంగళవారం 'ఫ్లాయిడ్'​ అంత్యక్రియలు.. బిడెన్​ నివాళి

ఆఫ్రో అమెరికన్​ జార్జి ఫ్లాయిడ్ కుటుంబాన్ని అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్​ కలవనున్నారు. హ్యూస్టన్​లో మంగళవారం ఫ్లాయిడ్​ అంత్యక్రియలు నిర్వహించనున్న నేపథ్యంలో అంతకుముందే బిడెన్​ నివాళులు అర్పించనున్నట్లు సమాచారం.

George Floyd
జార్జి ఫ్లాయిడ్

By

Published : Jun 8, 2020, 11:46 AM IST

అమెరికాలో ఓ పోలీసు చేతిలో మరణించిన ఆఫ్రో అమెరికన్​ జార్జి ఫ్లాయిడ్​ అంత్యక్రియలు మంగళవారం నిర్వహించనున్నారు. అంతకుముందే అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు, డెమొక్రటిక్​ అభ్యర్థి జో బిడెన్​.. ఫ్లాయిడ్​ కుటుంబాన్ని కలిసే అవకాశం ఉంది.

అయితే అంత్యక్రియలకు హాజరు కావటం లేదని బిడెన్​ సహాయకుడు తెలిపారు. ఫ్లాయిడ్ కుటుంబాన్ని కలిసి సానుభూతి ప్రకటించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బిడెన్​ వీడియో సందేశం ఇవ్వనున్నట్లు సమాచారం.

అంత్యక్రియలు..

అంత్యక్రియల నిమిత్తం ఫ్లాయిడ్ భౌతికకాయాన్ని హ్యూస్టన్​కు శనివారం తీసుకొచ్చారు. ఫ్లాయిడ్​ అంత్యక్రియలను హ్యూస్టన్​ శివారులోని పియర్లాండ్​​లో మంగళవారం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు ఫ్లాయిడ్ కుటుంబ సభ్యులు.

జార్జి భౌతికకాయాన్ని సోమవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ప్రజల సందర్శనకు అనుమతించనున్నారు అధికారులు. ఫ్లాయిడ్​కు అంతిమ వీడ్కోలు పలికేందుకు వచ్చేవారికి రవాణా సౌకర్యం ఏర్పాటు చేయనున్నారు. అయితే కొవిడ్- 19 నిబంధనల ప్రకారం సందర్శనకు పరిమిత సంఖ్యలో అనుమతి ఇస్తున్నట్లు మేయర్ సిల్వస్టర్ స్పష్టం చేశారు.

ఫ్లాయిడ్ హత్య..

ఓ ఫోర్జరీ కేసులో మే 25న అరెస్టు చేసిన మిన్నియాపోలిస్ పోలీసులు ఫ్లాయిడ్​పై కఠినంగా వ్యవహరించారు. మెడపై మోకాలితో తొక్కిపట్టి ఊపిరాడకుండా చేశారు. శ్వాస అందని కారణంగా ఫ్లాయిడ్​ మరణించారు. ఫ్లాయిడ్​ మృతితో అమెరికా వ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి.

ఇదీ చూడండిె:హ్యూస్టన్​కు చేరుకున్న ఫ్లాయిడ్​ పార్థివదేహం

ABOUT THE AUTHOR

...view details