తెలంగాణ

telangana

ETV Bharat / international

శ్వేతసౌధం కరోనా పరీక్షల్లో తప్పుడు ఫలితాలు!

అమెరికా శ్వేతసౌధంలో నిర్వహించిన కరోనా నిర్ధరణ పరీక్షల్లో తప్పుడు ఫలితాలు వచ్చినట్లు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. అబాట్ కంపెనీ తయారుచేసిన ఈ కిట్లు నాసిరకంగా ఉన్నట్లు పేర్కొంది.

By

Published : May 12, 2020, 9:45 AM IST

CORONA TESTING IN WHITE HOUSE
శ్వేతసౌధం కరోనా పరీక్షల్లో తప్పుడు ఫలితాలు!

అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధంలో ఉద్యోగులకు నిర్వహించిన కరోనా నిర్ధరణ పరీక్షల్లో తప్పుడు ఫలితాలు వచ్చినట్లు 'న్యూయార్క్‌ టైమ్స్‌' పత్రిక కథనం వెలువరించింది. ఈ పరీక్షల కోసం వినియోగించిన కిట్లు కరోనా సోకిన వారికి కూడా ఫలితాల్లో 'నెగెటివ్‌' చూపాయని పేర్కొంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఫలితాలు మారే అవకాశం ఉందని తయారీ సంస్థ అబాట్‌ కొన్నాళ్ల కిందట వెల్లడించింది. అమెరికా ఎఫ్‌డీఏ మార్చిలో ఈ కిట్లకు అత్యవసర అనుమతులు ఇచ్చింది. అప్పట్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ కిట్‌లను పొగడ్తలతో ముంచెత్తారు. ఈ టెస్టింగ్‌ కిట్లతో శ్వేత సౌధంలో పరీక్షలు నిర్వహించారు. ఇటీవల అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడి బృందాల్లోని కీలక సభ్యులకు కరోనా వైరస్‌ సోకినట్లు తేలింది.

ABOUT THE AUTHOR

...view details