తెలంగాణ

telangana

ETV Bharat / international

వైరల్​ కంటెంట్ నియంత్రణకు ఫేస్​బుక్ కీలక నిర్ణయం!

అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో వైరల్ కంటెంట్​ను నియంత్రించేందుకు ఫేస్​బుక్ కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా సమాచార విశ్వసనీయతను తెలుసుకునేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ఓ ప్రముఖ వార్తా సంస్థ వెల్లడించింది.

Facebook prepares emergency measures to regulate content
విశ్వసనీయత కోసం ఫేస్​బుక్ ప్రత్యేక ఉపకరణాల వినియోగం

By

Published : Oct 26, 2020, 3:42 PM IST

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు, అశాంతి సంబంధిత వైరల్​ కంటెంట్​ను నియంత్రించేదుకు ఫేస్​బుక్​ అత్యవసర చర్యలను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై విశ్వసనీయ వర్గాల సమచారాన్ని ప్రస్తావిస్తూ.. ప్రముఖ వార్తా సంస్థ వాల్​ స్ట్రీట్ జర్నల్​ కథనాన్ని ప్రచురించింది.

ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి.. ఎన్నికల సమయంలో ప్రశాంత వాతావరణాన్ని కల్పించేందుకు ఫేస్​బుక్ ప్రయత్నిస్తోందని ఈ కథనంలో పేర్కొంది.

'సురక్షితమైన ఎన్నికల కోసం మేము ఏళ్లుగా కృషి చేస్తున్నాం. గత ఎన్నికల నుంచి నేర్చుకున్న పాఠాలను ఇప్పుడు అమలు చేస్తున్నాం. నిపుణులను నియమించుకున్నాం. కొత్త బృందాలను ఏర్పాటు చేశాం.' అని ఓ ఫేస్​బుక్​ అధికారి తెలిపినట్లు వాల్​స్ట్రీట్ జర్నల్ రాసుకొచ్చింది.

' ఫేస్​బుక్​ తీసుకొస్తున్న ఈ చర్యలు వైరల్​ కంటెంట్​ తీవ్రత ఎక్కువ ఉన్న దేశాల కోసం రూపొందించినవి. మయన్మార్, శ్రీలంకల్లో వీటిని ఇప్పటికే వినియోగించడం గమనార్హం. వైరల్ కంటెంట్​ను నిరోధించేందుకు, విశ్వసనీయ సమాచారం గుర్తింపునకు ఫేస్​బుక్​ నూతన చర్యలు ఉపయోగపడతాయి' అని వాల్ల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.

ఇదీ చూడండి:'ఆ దేశంతోనే అమెరికా భద్రతకు అతిపెద్ద ముప్పు'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details