తెలంగాణ

telangana

ETV Bharat / international

ఫేస్​బుక్​ 'పెళ్లి పందిరి'- ఇక అమెరికాలో అధికారికం! - అమెరికా

సామాజిక మాధ్యమాల్లో సరికొత్త ట్రెండ్​ డేటింగ్ యాప్​లు. ఇప్పటికే చాలా ఫీచర్లతో అనేక యాప్​లు వచ్చాయి. ఫేస్​బుక్​ కూడా తాజాగా ఇందులోకి ప్రవేశించింది.

ఫేస్​బుక్​ 'పెళ్లి పందిరి'

By

Published : Sep 7, 2019, 6:40 AM IST

Updated : Sep 29, 2019, 5:53 PM IST

అమెరికాలో ప్రారంభమైన ఫేస్​బుక్​ 'పెళ్లి పందిరి'

ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతోన్న పోటీని తట్టుకునేందుకు ఫేస్​బుక్​ అన్నిరంగాల్లో అడుగుపెట్టాలని ప్రయత్నిస్తోంది. లవ్​, డేటింగ్​ పేరుతో కొత్త ఫీచర్​ను అమెరికాలో ప్రారంభించింది ఈ సామాజిక మాధ్యమ దిగ్గజం. ఇప్పటికే బ్రెజిల్​తో పాటు మరో 18 దేశాల్లో లవ్​, డేటింగ్​ సేవలను అందుబాటులోకి తెచ్చింది ఫేస్​బుక్​.

సామాజిక మాధ్యమాల్లో డేటింగ్​ యాప్​లకు క్రేజ్​ ఎక్కువగా ఉండటం వల్ల ఈ మార్కెట్​లోకి సులువుగా ప్రవేశించింది ఫేస్​బుక్​. ఈ రంగంలో టిండర్ ​యాప్​ దూసుకెళుతోంది. అయితే ​డేటింగ్​ సేవల ద్వారా ప్రజలు మరింత ఎక్కువసేపు తమ యాప్ ఉపయోగించేలా చేసేందుకు ఫేస్​బుక్​ ఈ ప్రణాళిక రచించింది.

ఫేస్​బుక్​ తన ప్రకటనల కోసం వినియోగదారుల డేటా ఉపయోగించదని స్పష్టం చేసింది. సరికొత్త డేటింగ్​ ఫీచర్​లో ఎటువంటి ప్రకటనలు ఉండవని తెలిపింది. గతంలో ఈ సోషల్​ మీడియా​ దిగ్గజం వినియోగదారుల సమాచారాన్ని భద్రపరచటంలో విఫలమైంది. డేటింగ్​ మరింత వ్యక్తిగతం కనుక కొంతమంది భయపడుతున్నారు.

ఇదీ చూడండి: ఫేస్​బుక్​పై దర్యాప్తునకు సిద్ధమైన అమెరికా

Last Updated : Sep 29, 2019, 5:53 PM IST

ABOUT THE AUTHOR

...view details