అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం(జులై 4) నాడు ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ చేసిన ఓ పని ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఓ చెరువులో అగ్రరాజ్య జెండా పట్టుకుని మార్క్ సర్ఫింగ్ చేయగా.. ఆ వీడియోను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
సర్ఫింగ్ చేసి...
జుకర్బర్గ్ జులై 4న ఓ చెరువులో ఎలక్ట్రిక్ సర్ఫింగ్ బోర్డుపై సర్ఫింగ్ చేశారు. జాతీయ జెండా పట్టుకుని బ్యాలెన్స్ చేసుకుంటూ నీటిపై దూసుకుపోయారు.
అక్కడి వరకు అంతా బాగానే సాగింది. కానీ ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన అనంతరం.. నెటిజన్లు దానిని విపరీతంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. మీమ్స్ వర్షం కురిపిస్తున్నారు.
ఇదీ చూడండి:-కుబేరులే కానీ.. ఆదాయపు పన్ను చెల్లించరట!