తెలంగాణ

telangana

ETV Bharat / international

'భారత్​లో టీకా​ డోసుల మధ్య వ్యవధి పెంపు మంచిదే' - కొవిషీల్డ్‌ రెండో డోసు గడువును స్వాగతించిన ఫౌచీ

కొవిషీల్డ్​ రెండు డోసుల మధ్య వ్యవధి పెంచడాన్నిప్రముఖ అంటువ్యాధులు నిపుణులు ఆంటోని ఫౌచీ స్వాగతించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎక్కువమందికి టీకా ఇవ్వడానికి ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుందని తెలిపారు.

Fauci
'డోసుల మధ్య గడుపు పెంచడం మంచిదే'

By

Published : May 14, 2021, 10:29 AM IST

భారత్‌లో కొవిషీల్డ్‌ రెండు డోసుల మధ్య వ్యవధిని 12 నుంచి 16 వారాలకు పెంచడాన్ని అమెరికా అంటువ్యాధుల సంస్థ డైరెక్టర్ ఆంటోని ఫౌచీ స్వాగతించారు. క్లిష్ట పరిస్థితుల్లో ఎక్కువమంది ప్రజలకు వేగంగా టీకాలు వేసేందుకు ఇది సహేతుకమైన మార్గంగా తాను నమ్ముతున్నట్లు తెలిపారు. వ్యాక్సినేషన్‌కు తగినన్ని టీకాలు దేశంలో లేనప్పుడు డోసుకు- డోసుకు మధ్య గడువు పొడగింపు ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

వ్యవధి పెంపు టీకా సమర్థతపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం కూడా చాలా తక్కువని ఫౌచీ చెప్పారు. కొవిషీల్డ్ టీకా మొదటి, రెండో డోసుల మధ్య వ్యవధిని 12నుంచి 16 వారాలకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ప్రజలకు ఎలాంటి అదనపు ముప్పు ఉండదని స్పష్టం చేసింది. ఈమేరకు స్పందించిన పౌచీ... గడువు పెంపు వల్ల ఎక్కువ మంది ప్రజలకు టీకాలు ఇవ్వోచ్చని పేర్కొన్నారు.

త్వరలో భారత్​లో అందుబాటులోకి రానున్న రష్యా టీకా స్పూత్నిక్​ వి 90 శాతం సమర్థవంతంగా పని చేస్తున్నట్లు ఫౌచీ తెలిపారు. భారత్​లో వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున వాటిని అరికట్టేందుకు మొత్తం మూడు వ్యాక్సిన్​లు పనిచేస్తాయన్నారు.

ఇదీ చూడండి:'కరోనా మహమ్మారి మరోమారు ఉగ్రరూపం'

ABOUT THE AUTHOR

...view details