ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా మహమ్మారిని నివారించేందుకు వాక్సిన్ పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్-19 వ్యాక్సిన్, ఇతర చికిత్స విధానాల అభివృద్ధి కోసం భారీగా నిధులు అవసరమని అంతర్జాతీయ వ్యాక్సిన్ పరిశోధన నిపుణులు పేర్కొన్నారు. నిధుల సమీకరణకు మద్దతుగా నిలవాలని కోరుతున్నారు.
కరోనా వ్యాక్సిన్ తయారీ, నిధుల సమీకరణకు మద్దతుగా నిలవాలనే ఉద్దేశంతోనే.. ఐరోపా సమాఖ్య సదస్సుకు ఒక్క రోజు ముందు ఈ మేరకు వెల్లడించారు పరిశోధకులు. చొరవ చూపటంలో అమెరికా సైతం దూరంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా చికిత్స సాధనాలు, వ్యాక్సిన్ అవసరమైన ప్రజలకు ఖర్చుతో నిమిత్తం లేకుండా అందించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ, దాని మిత్ర దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే.. వ్యాక్సిన్, చికిత్స విధానాలు, ఔషధాల కోసం 2021 చివరి నాటికి సుమారు 31 బిలియన్ డాలర్లకుపైగా అసరమని అంచనా వేశాయి.
" కొవిడ్-19 వ్యాక్సిన్ కోసం తొందరపడకపోతే.. మానవ వనరులు, ఆర్థిక నష్టం మరింత ఎక్కవ అవుతుంది. ఆ సంఖ్య ఊహించుకోవడానికి ఎక్కువగా ఉన్నా.. ఎప్పుడైతే ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించిస్తామో ఆ నష్టం అంతగా అనిపించదు. భవిష్యత్లో ఆర్థిక వ్యవస్థలను పునరుత్తేజనం చేసేందుకు ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేయడంపై ఆలోచించండి. ఇప్పుడు బిలియన్స్ ఖర్చు చేసినట్లయితే.. ఆ తర్వాత ట్రిలియన్స్ ఖర్చు చేయాల్సిన అవసరం రాదు."
- డాక్టర్ న్గోజి ఒకోంజో, డబ్ల్యూహెచ్ఓ చీఫ్ ప్రత్యేక ప్రతినిధి