టీకాలు అందుబాటులోకి వచ్చిన వెంటనే ఎలాంటి సంకోచాలు లేకుండా వాటిని తీసుకోవాలని నలుగురు అమెరికా మాజీ అధ్యక్షులు ప్రజలకు పిలుపునిచ్చారు. టీకాలపై భయాలను తొలగించి వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రూపొందించిన ప్రచార చిత్రం ద్వారా బరాక్ ఒబామా, జార్జి బుష్, బిల్ క్లింటన్, జిమ్మీ కార్టర్ ఈ మేరకు ప్రజలకు సందేశమిచ్చారు. వారి సతీమణులు మిషెల్ ఒబామా, లారా బుష్, హిల్లరీ క్లింటన్, రోసలిన్ కార్టర్ కూడా ఈ చిత్రంలో కనిపించారు.
'సంకోచాలు వద్దు.. టీకాలు తీసుకోండి' - corona vaccine america
ఎలాంటి సంకోచాలు లేకుండా టీకాలు తీసుకోమని అమెరికన్లకు మాజీ అధ్యక్షులు పిలుపునిచ్చారు. ఈ మేరకు బరాక్ ఒబామా, జార్జి బుష్, బిల్ క్లింటన్, జిమ్మీ కార్టర్ ప్రచార చిత్రం ద్వారా ప్రజలకు సందేశమిచ్చారు.
సంకోచాలు వద్దు.. టీకాలు తీసుకోండి
మహమ్మారి నుంచి మిమ్మల్ని, మీరు ప్రేమించేవారిని టీకాలు కాపాడతాయని బుష్ పేర్కొన్నారు. మహమ్మారిని అంతం చేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి టీకా తొలి అడుగు అని ఒబామా అన్నారు.
ఇదీ చదవండి :నేడే క్వాడ్ సదస్సు- తొలిసారి దేశాధినేతలతో