తెలంగాణ

telangana

By

Published : Dec 4, 2019, 5:20 AM IST

Updated : Dec 4, 2019, 10:54 AM IST

ETV Bharat / international

'ట్రంప్​ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు'

అభిశంసన విచారణ ఎదుర్కొంటున్న అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ప్రతినిధుల సభకు చెందిన కీలక కమిటీ నివేదిక తెలిపింది.

Trump
'ట్రంప్​ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు'

'ట్రంప్​ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు'

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ప్రతినిధుల సభకు చెందిన కీలక కమిటీ నివేదిక వెల్లడించింది. అభిశంసన విచారణ ఆధారంగా ఈ నివేదికను హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీ , పర్యవేక్షణ, సంస్కరణ కమిటీ, విదేశీ వ్యవహారాల కమిటీల సభ్యులు రూపొందించారు. ఈ నివేదికను శాశ్వత ఎంపిక కమిటీ విడుదల చేసింది. తన రాజకీయ ప్రత్యర్థి, మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్‌పై దర్యాప్తు కోసం ఉక్రెయిన్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ట్రంప్ తన కార్యాలయ అధికారాన్ని ఉపయోగించారని నివేదిక పేర్కొంది.

ఎన్నికల్లో గెలిచేందుకు విదేశీ సహాయం పొందాలనే పథకం బయటపడిన తర్వాత ట్రంప్ తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి అనేక ఆటంకాలకు పాల్పడినట్లు ఆధారాలు స్పష్టంగా ఉన్నాయని కమిటీ సభ్యులు వెల్లడించారు. ట్రంప్ తన అధికారాన్ని వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారన్న కమిటీ... దేశ భద్రతను పణంగా పెట్టారని ఆరోపించింది.

ఈ నివేదికను శ్వేతసౌధం తోసిపుచ్చింది. ట్రంప్ తప్పు చేశారనేదానికి ఆధారాలు సమకూర్చలేక కమిటీ ఛైర్మన్ సహా డెమొక్రాట్లు పూర్తిగా విఫలమయ్యారని పేర్కొంది.

ఇదీ చూడండి: ఎడారిలో తిండితిప్పలు లేకుండా 13 రోజులు..!

Last Updated : Dec 4, 2019, 10:54 AM IST

ABOUT THE AUTHOR

...view details