అమెరికాలో ప్రతి నలుగురు ప్రవాసీల్లో ఒకరు భారతీయుడేనని హోంల్యాండ్ భద్రతా విభాగం నివేదిక తెలిపింది. అమెరికాలో నివాసం ఏర్పరచుకున్న ఇతర దేశ సంతతికి చెందినవారిలో... 60 శాతం మంది ఆసియా దేశాల పౌరులేనని నివేదిక పేర్కొంది.
2016 లెక్కల ప్రకారం అమెరికాలో 5.8 లక్షల మంది భారతీయులు రెసిడెంట్ నాన్ ఇమ్మిగ్రెంట్స్‌గా ఉన్నట్లు నివేదికలో వెల్లడైంది. వీరిలో 4.4 లక్షల మంది తాత్కాలిక ఉద్యోగులు కాగా.. 1.4 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు.
3.4 లక్షల మంది నివాసేతర ప్రవాసులతో చైనా.. ఈ విషయంలో భారత్ తరువాతి స్థానంలో ఉంది. వీరిలో 40 వేల మంది తాత్కాలిక ఉద్యోగులు, 2.6 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో మెక్సికో, కెనడా, దక్షిణ కొరియా, జపాన్, సౌదీ అరేబియా దేశాలు ఉన్నాయి.