తెలంగాణ

telangana

ETV Bharat / international

శ్వేతసౌధంలో కలకలం.. ట్రంప్​కు పార్సిల్​లో విషం - వైట్ హౌజ్ రిసిన్ కవర్

అమెరికా అధ్యక్షుడి చిరునామాతో శ్వేతసౌధానికి వచ్చిన విషపూరితమైన ఓ ప్యాకెట్​ను అధికారులు అడ్డుకున్నారు. కవరులో రిసిన్ అనే పదార్థం ఉన్నట్లు గుర్తించారు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై ఆరా తీస్తున్నారు.

Envelope addressed to White House contained ricin
శ్వేతసౌధ చిరునామాకు విషంతో నిండిన కవరు

By

Published : Sep 20, 2020, 8:38 AM IST

అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధానికి వచ్చిన పార్సిల్​లో విషం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రిసిన్ అనే విష పదార్థాన్ని ఎన్వలప్​​​లో లభించినట్లు తెలిపారు. అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ చిరునామాతో వచ్చిన ఈ కవర్​ను అడ్డుకున్నట్లు స్పష్టం చేశారు.

ఇందులో ఉన్నది రిసిన్ అనే ప్రమాదకర విషమేనని ప్రాథమిక విచారణలో తేలిందని అధికారులు చెప్పారు. రెండు పరీక్షల్లోనూ ఇదే విషయం వెల్లడైనట్లు పేర్కొన్నారు. ఈ విషం సాధారణంగా ఆముద గింజల్లో లభ్యమవుతుందని వెల్లడించారు.

ఈ ప్యాకెట్​ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఎఫ్​బీఐ, సీక్రెట్ సర్వీస్​, యూఎస్ పోస్టల్ ఇన్స్పెక్షన్ సర్వీసులు సంయుక్తంగా దీనిపై విచారణ ప్రారంభించాయి. ఇది కెనడా నుంచి వచ్చి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

రిసిన్​తో మరణమే!

ఆముదాల నుంచి తయారు చేసే అత్యంత విషపూరితమైన పదార్థమే రిసిన్. దీన్ని ఉగ్రవాద దాడులలో తరచుగా ఉపయోగిస్తారు. పౌడర్, గుళికలు, యాసిడ్ రూపంలో దీన్ని ప్రయోగిస్తారు. ఈ విషాన్ని స్వీకరిస్తే వాంతులు, కడుపులో రక్తస్రావం వంటివి తలెత్తుతాయి. కిడ్నీలు, కాలేయం, ప్లీహం వంటి అవయవాలు వైఫల్యానికి గురై ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details