తెలంగాణ

telangana

ETV Bharat / international

కార్చిచ్చు ఎఫెక్ట్- మరోమారు అంధకారంలో కాలిఫోర్నియా

‍‌అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం మరోమారు అంధకారంలో చిక్కుకుపోయింది. కార్చిచ్చు వేడిగాలి ప్రభావం కారణంగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు అధికారులు. 50వేలమంది ప్రజలు తాజాగా తమ నివాసాలను వదలివెళ్లినట్లు అధికారులు ప్రకటించారు.

కార్చిచ్చు ఎఫెక్ట్-మరోమారు అంధకారంలో కాలిఫోర్నియా

By

Published : Oct 27, 2019, 10:11 AM IST

అమెరికాలోని కాలిఫోర్నియాను చుట్టుముట్టిన కార్చిచ్చుతో ఇళ్లను వదలి వెళ్లిపోవాలని ప్రజలకు సూచించారు అధికారులు. తాజాగా 50వేలమంది తమ నివాసాలను వదలి వెళ్లినట్లు నిర్ధరించారు. ప్రకృతి విపత్తు కారణంగా సొనోమా కౌంటీలో గత 25 ఏళ్లలో జరిగిన తరలింపులో ఇదే అతి పెద్దదని అధికారులు చెబుతున్నారు.

గంటకు 137 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న వేడి గాలుల ఫలితంగా విద్యుత్‌ సరఫరాను అధికారులు నిలిపి వేశారు. విద్యుత్ సరఫరా నిలిపివేతతో అనేక ఇళ్లు, వాణిజ్య కేంద్రాలు చీకటిగా మారాయి. మొత్తంగా 9,40,000 ఇళ్లల్లో విద్యుత్​ సరఫరా నిలిచిపోయింది.

ఉత్తర కాలిఫోర్నియాలో 50 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.

సోనోమా ద్రాక్షతోటల ప్రాంతంలో దాదాపు 23,700 ఎకరాల అడవి అగ్ని కీలల్లో చిక్కుకున్నట్లు వెల్లడించారు. కాలిఫోర్నియా దక్షిణ ప్రాంతంలో మాత్రమే వెయ్యి మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది నిరంతరాయంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు.

కార్చిచ్చు ఎఫెక్ట్-మరోమారు అంధకారంలో కాలిఫోర్నియా

ఇదీ చూడండి: 28రోజుల తర్వాత ఒడ్డుకు చేరుకున్న సముద్ర వీరుడు!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details