అమెరికాలో కార్చిచ్చు బీభత్సం కొనసాగుతోంది. లాస్ ఏంజిల్స్ ఈశాన్య ప్రాంతంలో ఉన్న పర్వతాల నుంచి మొదలైన కార్చిచ్చు విధ్వంసం సృష్టిస్తోంది. కాలిఫోర్నియా చరిత్రలో ఇప్పటివరకు చూసిన అతిపెద్ద కార్చిచ్చుల్లో ఇది ఒకటి. ఆ రాష్ట్ర చరిత్రలోనే ఇది ఐదో అతిపెద్ద దావానలమని అధికారులు తెలిపారు.
- ఇప్పటికే 14,500 చదరపు కిమీ భూభాగం కాలిపోయింది. కనక్టికట్ అనే రాష్ట్ర వైశాల్యం కంటే ఇది ఎక్కువ.
- ఫుట్ హిల్, ఎడారి ప్రాంతాల్లో ఉన్న వేలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు.
- వందలాది ఇళ్లు, ప్రఖ్యాత అభయారణ్యాలు ఇప్పటికే బూడిదయ్యాయి.
- ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 23,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
- ఈ కార్చిచ్చు ధాటికి 6,400 ఇళ్లు దగ్ధమయ్యాయి.
- మొత్తం 19 వేల అగ్నిమాపక వాహనాలు రాష్ట్రవ్యాప్తంగా రాజుకున్న 27 కార్చిచ్చులను అదుపుచేసేందుకు యత్నిస్తున్నాయి.
- ఈ ఏడాదిలో ఇప్పటికే 7900 కార్చిచ్చులు నమోదయ్యాయి.