తెలంగాణ

telangana

ETV Bharat / international

అమ్మతో ఆడుకున్న ఆ బుజ్జి గొరిల్లా ఇక లేదు - audubon zoo gorilla playing with mom

ఆరు రోజుల క్రితమే పురుడుపోసుకుంది. తొలిచూరు సంతానమని అమ్మ అల్లారుముద్దుగా అక్కున చేర్చుకుంది. అమ్మతో ఆడుతూ, పాడుతూ జూ అంతా తిరిగి సందడి చేసింది. ఆ వీడియో ప్రపంచం దృష్టినే ఆకట్టుకుంది. కానీ, ఆ చిన్నారి గొరిల్లాపై కాలం కన్నెర్ర జేసింది. ఆరు రోజులకే ఆ బుజ్జి గొరిల్లా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. తల్లి గొరిల్లాకు పుట్టెడు శోకం మిగిల్చింది.

Endangered baby gorilla dies six days after birth in america, new orlans
అమ్మతో ఆడుకున్న ఆ బుజ్జి గొరిల్లా ఇక లేదు!

By

Published : Sep 11, 2020, 1:40 PM IST

ఎనిమిది మాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చిన ఓ గొరిల్లాకు కడుపుకోత మిగిలింది. అమెరికా న్యూ ఒర్లాన్స్‌లోని ఓ జూలో టుమానీ అనే గొరిల్లా శుక్రవారం ఓ బుజ్జి గొరిల్లాకు జన్మనిచ్చింది. బిడ్డను అక్కున చేర్చుకొని ముద్దాడింది. ఎంతో మురిపెంగా తన ప్రతిరూపాన్ని కౌగిలించుకున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లుకొట్టాయి. కానీ, వారం తిరక్కుండానే ఆ ఆనందాలు ఆవిరయ్యాయి. బుజ్జి గొరిల్లా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.

అమ్మతో ఆడుకున్న ఆ బుజ్జి గొరిల్లా ఇక లేదు!

ఆడుబాన్ జూలో గర్భం దాల్చిన టుమానీ కడుపున పురుడుపోసుకుంది బుజ్జి గొరిల్లా. పుట్టినప్పుడు ఆరోగ్యంగా కనిపించిన చిన్నారి గొరిల్లా తల్లికి దగ్గరవ్వడం చూసి, జూ సిబ్బంది సంతోషించారు. తల్లీ బిడ్డలను ఏకాంతంగానే ఉంచారు. అందుకే, పుట్టింది ఆడ గొరిల్లానా, మగ గొరిల్లానా కూడా చూడలేదు. చిన్నారి గొరిల్లాకి ఇంకా నామకరణం కూడా కాలేదు. కానీ, బుధవారం ఆకస్మాత్తుగా చిన్నారి గొరిల్లా చిన్నబోయింది. వెంటనే పశు వైద్యశాలకు తరలించారు సిబ్బంది. కానీ, ఫలితం లేకపోయింది.

అయితే, గొరిల్లా మృతికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉండగా.. టుమానీకి చనుబాల ఉత్పత్తి తక్కువ అవ్వడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు జూ అధికారులు. బుజ్జి గొరిల్లా మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపారు.

ఇవీ చదవండి: బుల్లి గొరిల్లాను తల్లి ఏం చేసిందో చూడండి!

ప్రత్యేక హెలికాప్టర్​లో గొరిల్లా.. కారణమేంటంటే?

ABOUT THE AUTHOR

...view details