ప్రముఖ ప్రవాస భారతీయ ఫిజీషియన్ అజయ్ లోధా(58) కొవిడ్-19తో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. భారత సంతతి ఫిజీషియన్ల సంస్థ(ఆపి) మాజీ అధ్యక్షుడైన అజయ్.. ఎనిమిది నెలల కిందట కరోనా బారినపడ్డారు. అప్పటినుంచి ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 21 మృతి చెందారు.
ప్రముఖుల సంతాపం..
ప్రతిష్ఠాత్మక ఇల్లిస్ ఐలాండ్ పతకం 2016లో లోధాను వరిచింది. రాజస్థాన్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన అజయ్ మృతిపై.. న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ జనరల్, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజె, బీఎస్ఎఫ్ మాజీ డైరెక్టర్ జనరల్ కేకే శర్మతో పాటు చాలా మంది ప్రముఖ ప్రవాస భారతీయులు సంతాపం తెలిపారు. వీరిలో ఆపి అధ్యక్షుడు సుధాకర్ జొన్నలగడ్డ, ఆపి అధ్యక్షురాలిగా ఎన్నికైన డాక్టర్ అనుపమ గోటిముకుల, ఉపాధ్యక్షుడు డా. రవి ఉన్నారు. వైద్యుడిగా సమాజానికి ఆయన చేసిన సేవలను వారు కొనియాడారు.
ఇదీ చదవండి:అమెరికాలో మహిళను పట్టాలపైకి తోసిన భారతీయుడు