తెలంగాణ

telangana

ETV Bharat / international

పుతిన్‌కు ఎలాన్‌ మస్క్‌ మరో ఛాలెంజ్​.. ఈసారి..! - రష్యా అధినేత పుతిన్​కు మస్క్​ ఛాలెంజ్​

Elon musk challenge to Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​కు మరో సవాలు విసిరారు ప్రపంచ కుబేరుడు ఎలన్​ మస్క్​. పుతిన్​ గాని తనతో తలపడ దలుచుకుంటే ఆయనకు ఉన్న సొంత ఎలుగుబంటిని తెచ్చుకోవచ్చని చెప్పారు. ఇందుకు రష్యా కూడా గట్టిగానే స్పందించింది.

Elon Musk's Combat Challenge To Putin
పుతిన్‌కు ఎలాన్‌ మస్క్‌ మరో సవాల్‌

By

Published : Mar 15, 2022, 11:36 PM IST

Elon musk challenge to Putin: ఉక్రెయిన్‌పై దండయాత్ర సాగిస్తోన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో ఫైట్‌ చేస్తానంటూ సవాల్‌ విసిరిన స్పేస్‌ఎక్స్‌ సీఈఓ ఎలాన్‌ మస్క్‌ తాజాగా మరో ఛాలెంజ్‌ చేశారు. తనతో పోరాడేందుకు పుతిన్‌ ఆయన సొంత ఎలుగుబంటిని కూడా తెచ్చుకోవచ్చని అన్నారు. అసలేం జరిగిందంటే..

ఉక్రెయిన్‌పై భీకర దాడులు చేస్తున్న రష్యాపై ప్రపంచ దేశాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్‌కు సవాల్‌ విసురుతూ మస్క్‌ సోమవారం ఓ ట్వీట్‌ చేశారు. 'పుతిన్‌తో ముఖాముఖి పోరాటానికి సవాల్‌ చేస్తున్నా. ఇందులో గెలిచినవారే ఉక్రెయిన్‌లో యుద్ధం కొనసాగాలా ఆగిపోవాలా అన్నది నిర్ణయిస్తారు' అని మస్క్‌ రాసుకొచ్చారు.

అయితే మస్క్‌ ఛాలెంజ్‌కు రష్యా స్పేస్‌ ఏజెన్సీ చీఫ్‌ దిమిత్రి రొగోజిన్‌ స్పందించారు. 'నువ్వు ఓ చిన్న దెయ్యం. ఇంకా యంగ్‌ అనుకుంటున్నావా ? బలహీనుడా.. నాతో పోటీ పడు. అది కూడా సయమం వృథానే. ముందు నా తమ్ముడిపైన గెలిచి చూపించు' అని మస్క్‌పై వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. దీనికి ఎలాన్‌ మస్క్‌ కూడా దీటుగానే బదులిచ్చారు. పుతిన్‌ ఓ ఎలుగుబంటిపై రైడ్‌ చేస్తోన్న ఫొటో పక్కన తాను మంటలు రువ్వుతున్న ఫొటోను జతచేసి మస్క్‌ ఓ పోస్ట్ చేశారు. పుతిన్‌ ఆయనతో పాటు ఎలుగుబంటిని కూడా పోరాటానికి తీసుకురావొచ్చు అనే అర్థం వచ్చేలా మరోసారి రష్యా అధ్యక్షుడికి సవాల్‌ విసిరారు.

రష్యా దాడులతో కల్లోలంగా మారిన ఉక్రెయిన్‌లో ఎలాన్‌ మస్క్‌ స్టార్‌లింక్‌ శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవల్ని ప్రారంభించి అక్కడి ప్రజలకు అండగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ శాటిలైట్‌తో నిరంతరాయ ఇంటర్నెట్‌ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. మరిన్ని టెర్మినళ్లను సైతం ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. రష్యా దాడులు ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్‌లో ఇంటర్నెట్‌ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సమయంలో అక్కడి ప్రజలకు కీలక సమాచారం చేరవేసేందుకు నిరంతర ఇంటర్నెట్‌ సేవల్ని మస్క్‌ ప్రారంభించారు.

ఇదీ చూడండి:

13,500 మంది రష్యా సైనికులు హతం- కీవ్​కు మూడు దేశాల ప్రధానులు

ABOUT THE AUTHOR

...view details