కాల్పుల మోతతో దద్దరిల్లింది ఉత్తర బ్రెజిల్‌లోని బెలెమ్ నగరం. మూడు కార్లు, ఓ మోటార్ సైకిల్‌పై వచ్చిన ఏడుగురు దుండగులు ఓ బార్లో విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 11మంది మరణించారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
కార్లలో వచ్చి బుల్లెట్ల వర్షం.. 11 మంది మృతి
బ్రెజిల్లో తుపాకులతో విధ్వంసం సృష్టించారు ఏడుగురు దుండగులు. కార్లలో వచ్చి బెలెమ్ నగరంలోని ఓ బార్లో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మొత్తం 11మంది చనిపోయారు.
కార్లలో వచ్చి బుల్లెట్ల వర్షం.. 11 మంది మృతి
కాల్పులు జరిపాక దుండగులు పారిపోయారని చెప్పారు పోలీసులు. అయితే, గాయపడిన ఓ దుండగుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తునట్టు వెల్లడించారు.