తెలంగాణ

telangana

ETV Bharat / international

'భారత ఎన్నికలు ప్రపంచానికే స్ఫూర్తిదాయకం' - Mike Pompeo

సార్వత్రిక ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అమెరికా నేతలు అభినందనలు తెలిపారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలోని ఎన్నికల ప్రక్రియ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు.

భారత ఎన్నికలు ప్రపంచానికే స్ఫూర్తిదాయకం: అమెరికా

By

Published : May 24, 2019, 11:36 AM IST

Updated : May 24, 2019, 12:30 PM IST

'భారత ఎన్నికలు ప్రపంచానికే స్ఫూర్తిదాయకం'

లోక్​సభ ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని ఎన్​డీఏ విజయం సాధించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అమెరికా నేతలు శుభాకాంక్షలు తెలిపారు. భారత ఎన్నికలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల ప్రజలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

నిబద్ధతకు నిదర్శనం

అమెరికా ఉపాధ్యక్షుడు మైక్​ పెన్స్​ ప్రధాని మోదీకి ట్విట్టర్​ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్యం పట్ల భారత ప్రజలకు ఉన్న నిబద్ధతకు ఈ ఎన్నికలే నిదర్శనమని పేర్కొన్నారు. ఇరుదేశాల బంధం బలోపేతానికి భారత్​తో కలిసి కొనసాగుతామన్నారు.

ప్రపంచానికే స్ఫూర్తి

ఎన్నికల్లో విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఎన్​డీఏకి అమెరికా విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో శుభాకాంక్షలు తెలిపారు. అధిక సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నందుకు భారత ప్రజలకు అభినందనలు తెలిపారు. ప్రపంచ అతిపెద్ద ప్రజాస్వామ్యంలోని ఎన్నికల ప్రక్రియ ప్రపంచానికే స్ఫూర్తి అంటూ అని కొనియాడారు.

'పోలింగ్​​ శాతం' అభినందనీయం

భారత్​లో భారీస్థాయిలో పోలింగ్​ శాతం నమోదవడంపై​ ప్రశంసలు కురిపించారు అమెరికా విదేశాంగ ప్రతినిధి మోర్గాన్​ ఓర్టాగస్​. సుమారు 60కోట్ల మంది ప్రజలు ఎన్నికల్లో భాగస్వామ్యులు అయ్యారని, భారత ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియను అద్భుతంగా నిర్వహించిందని కొనియాడారు. భారత్​-అమెరికా ఉగ్రవాద నిర్మూలనతో పాటు పలు అంశాల్లో కీలక భాగస్వాములని గుర్తుచేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నామని భారత సంతతి కాంగ్రెస్​ సభ్యుడు రాజా కృష్ణమూర్తి తెలిపారు. భారత్​-అమెరికా సంబంధాలు మరింత బలోపేతమవుతాయని ధీమా వ్యక్తంచేశారు.

పలువురు అమెరికా చట్టసభ్యులు మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. హౌస్​ మెజార్టీ నాయకుడు స్టెనీ హోయెర్​, కాంగ్రెస్​ సభ్యుడు జార్జ్​ హోల్డింగ్​, సెనేటర్​ కెవిన్​ థామస్​, జాన్​ కార్నిన్​ మోదీని అభినందించారు.

ఇదీ చూడండి: మోదీకి దేశాధినేతల శుభాకాంక్షల వెల్లువ

Last Updated : May 24, 2019, 12:30 PM IST

ABOUT THE AUTHOR

...view details