అమెరికాలో ఓ వృద్ధ దంపతులు తమ వివాహ వార్షికోత్సవాన్ని వింతగా జరుపుకున్నారు. కెంటుకీ రాష్ట్రానికి చెందిన నియోల్ జీన్(93), విర్జీనియా(91) తమ 73 వ వివాహ దినోత్సవాన్ని కరోనా టీకా తీసుకుని వేడుక చేసుకున్నారు. రాష్ట్రంలోని సన్సినాటి పట్టణంలో జరిగిన టీకా పంపిణీ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని టీకా వేయించుకున్నారు. సిన్సినాటి సిటీలో ఆరోగ్య కార్యకర్తల తర్వాత మొదటి టీకా వెయించుకున్న వారు వీరే కావడం విశేషం. మరో మూడు వారాల్లో మరో డోస్‌ను తీసుకోనున్నారు.
నీను ఒక స్క్వేర్ డాన్సర్‌ను. ప్రజలందరూ టీకా తీసుకొని.. పరిస్థితులు సాధారణ స్థితికి రావాలి. అలా అయితే మళ్లీ మేము డాన్స్‌ను ఆస్వాదించవచ్చు.