తెలంగాణ

telangana

ETV Bharat / international

2కోట్ల 50 లక్షలకు చేరువలో రికవరీల సంఖ్య - కొవిడ్-19 తాజా వార్తలు

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి గడగడలాడిస్తోంది. రోజూ లక్షలాది మంది వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య 3.33 కోట్లకు చేరువైంది. వైరస్ ధాటికి 10.02 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 2.46 కోట్ల మంది కోలుకున్నారు.

corona world
కరోనా మహమ్మారి

By

Published : Sep 28, 2020, 8:05 AM IST

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అంతకంతకూ విజృంభిస్తోంది. పలు దేశాల్లో భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు 3.33 కోట్ల మందికి వైరస్ సోకగా.. 10.02 లక్షల మంది మృత్యువాత పడ్డారు. సుమారు 2.46 కోట్ల మంది కోలుకున్నారు.

  • అమెరికాలో కొత్తగా 33 వేల కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 7.32 లక్షలకు చేరుకోగా.. 2.09 లక్షల మంది వైరస్​కు బలయ్యారు.
  • బ్రెజిల్​లో ఆదివారం 14 వేల కేసులు రాగా.. మొత్తం సంఖ్య 4.73 లక్షలకు చేరింది.
  • రష్యాలో వైరస్ వ్యాప్తి స్థిరంగా ఉంది. కొత్తగా 7,867 మందికి వైరస్ సోకింది. మొత్తం సంఖ్య 11.51 లక్షలకు చేరింది. మరణాల సంఖ్య 20 వేలకు దాటింది.
  • ఫ్రాన్స్​లో ఆదివారం 11 వేల మందికి సోకినట్లు నిర్ధరించారు. ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 5 లక్షలు దాటగా.. 31 వేల మంది చనిపోయారు.
  • అర్జెంటీనాలో క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం 8 వేల మంది వైరస్ బారిన పడగా.. ఇప్పటివరకు 6.91 లక్షల మందికి సోకింది.
దేశం మొత్తం కేసులు మరణాలు కోలుకున్నవారు
అమెరికా 73,21,343 2,09,453 45,60,456
బ్రెజిల్ 47,32,348 1,41,776 50,13,367
రష్యా 11,51,438 20,324 9,43,218
కొలంబియా 8,13,056 25,488 7,11,472
పెరూ 8,05,302 32,262 6,64,490

ABOUT THE AUTHOR

...view details