తెలంగాణ

telangana

ETV Bharat / international

జైలులో ఘర్షణ- 68 మంది ఖైదీలు మృతి - ఈక్వెడార్ జైలు ఘర్షణలు

prison
జైలు

By

Published : Nov 13, 2021, 10:50 PM IST

Updated : Nov 14, 2021, 8:10 AM IST

22:48 November 13

జైలులో ఘర్షణ- 68 మంది ఖైదీలు మృతి

ఈక్వెడార్​ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో దాదాపు 68 మంది ఖైదీలు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు.  

మరో 25 మంది ఖైదీలకు తీవ్రంగా గాయాలైనట్లు తెలిసింది. ఘటనా స్థలంలో పేలుడు పదార్థాలు, తుపాకులు గుర్తించి వాటిని సీజ్ చేసినట్లు లిటోలర్ జైలు అధికారి పేర్కొన్నారు.  

జైలు లోపల నుంచి చాలా సమయంపాటు పేలుళ్లు వినిపించాయని గాయాక్విల్​ నగరంలో లిటోలర్ జైలు సమీప ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు కొందరు తెలిపారు. అయితే.. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు కొన్ని సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయ్యాయి.  

ఈక్వెడార్​లో డ్రగ్స్ సరఫరా, ఇతర నేరాలను అదుపుచేసేందుకుగాను అక్టోబర్​లో ఎమర్జెన్సీ విధిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు అధ్యక్షుడు గైలెర్మో లాసో. ఈ నేపథ్యంలో జైలు ఘర్షణలు చోటుచేసుకుంటాన్నాయి. గతంలోనూ ఈక్వెడార్​లోని జైలులో గ్యాంగ్ వార్ జరిగింది. ఆ ఘటనలో దాదాపు 118 మంది ప్రాణాలు కోల్పోయారు.  

Last Updated : Nov 14, 2021, 8:10 AM IST

ABOUT THE AUTHOR

...view details