తెలంగాణ

telangana

By

Published : Sep 23, 2021, 6:31 AM IST

Updated : Sep 23, 2021, 10:37 AM IST

ETV Bharat / international

Modi us visit 2021: అమెరికాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం

నాలుగు రోజుల పర్యటన కోసం అమెరికా(Modi us visit 2021) చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వాషింగ్టన్​ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. వంద మందికిపైగా ప్రవాస భారతీయులు ఆయన కోసం ఎయిర్​పోర్టుకు వచ్చారు.

PM Modi in Washington
అమెరికాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం

క్వాడ్​ సదస్సులో పాల్గొనేందుకు బుధవారం బయలుదేరి వెళ్లిన ప్రధాని మోదీ అమెరికా(Modi us visit 2021) చేరుకున్నారు. వాషింగ్టన్​లోని జాయింట్​ బేస్​ ఆండ్రూస్​ విమానాశ్రయం​లో మోదీకి(PM Modi in Washington ) ఘన స్వాగతం లభించింది. అమెరికాలో భారత రాయబారి తరణ్​జిత్​ సింగ్​ సందు.. విమానాశ్రయానికి చేరుకుని స్వాగతం పలికారు. ఆయనతో పాటు అమెరికా అధికారులు.. ఆర్మీ బ్రిగేడియర్​ అనూప్​ సింగాల్​, ఎయిర్​ కమాండర్​ అంజన్​ భద్ర, నౌకాదళ కమాండర్​ నిర్భయా బప్నా, అమెరికా విదేశాంగ శాఖలోని మేనేజ్​మెంట్​, వనరుల విభాగం డిప్యూటీ టీహెచ్​ బ్రియాన్​ మెక్​కియాన్​లు.. హాజరయ్యారు.

మోదీకి స్వాగతం పలుకుతున్న అధికారులు
విమానాశ్రయంలో మోదీకి స్వాగతం పలుకుతున్న అధికారులు

మోదీ రాక కోసం..

ఓ వైపు చిరుజల్లులు కురుస్తున్నా.. మోదీ రాకకోసం భారత జాతీయ పతాకాలు చేతపట్టుకుని ఎదురుచూశారు అక్కడి ప్రవాస భారతీయులు. వంద మందికిపైగా విమానాశ్రయానికి వచ్చారు. విమానం నుంచి మోదీ దిగుతుండగా.. ఆయనకు మద్దతుగా మోదీ, మోదీ అంటూ నినాదాలు చేశారు. తన కోసం వేచి చూస్తున్న వారిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు మోదీ.

మోదీ రాకకోసం ఎయిర్​పోర్ట్​లో ప్రవాస భారతీయులు
ప్రవాసులతో ప్రధాని మోదీ
ప్రవాస భారతీయులతో ప్రధాని మోదీ

" వాషింగ్టన్​లో నాకు స్వాగతం పలికిన ప్రవాస భారతీయులు కృతజ్ఞతలు. మన ప్రవాసులే మనకు బలం. ప్రపంచవ్యాప్తంగా భారతీయులు తమ ప్రత్యేకతను చాటుకోవటం అభినందనీయం "

- ప్రధాని మోదీ.

అనంతరం విమానాశ్రయం నుంచి వాషింగ్టన్​లోని హోటల్​కు చేరుకున్నారు మోదీ. భారతీయ సంప్రదాయ చీర కట్టులో అక్కడి సిబ్బంది మోదీకి స్వాగతం పలికారు.

హోటల్​లో సంప్రదాయ చీరకట్టులో మోదీకి స్వాగతం

నాలుగు రోజుల పర్యటన..

నాలుగు రోజుల పర్యటనలో భాగంగా క్వాడ్​ సదస్సు సహా ఐక్యరాజ్య సమితి 76వ వార్షిక సమావేశం, ద్వైపాక్షిక భేటీల్లో పాల్గొననున్నారు మోదీ.

ఇదీ చూడండి:Modi US visit: మోదీ అమెరికా పర్యటన సాగనుందిలా..

Last Updated : Sep 23, 2021, 10:37 AM IST

ABOUT THE AUTHOR

...view details