తెలంగాణ

telangana

ETV Bharat / international

హెలికాప్టర్​లో తిరుగుతూ చర్చి ఫాదర్​ ఆశీస్సులు - Easter in Rio de janeiro

ప్రపంచ దేశాల్లో 'ఈస్టర్​ సండే'ను నిరాడంబరంగా జరుపుకున్నారు. బ్రెజిల్​ రియో డి జెనిరోలో ఓ ఫాదర్​ వినూత్నంగా హెలికాఫ్టర్​లో నగరమంతా తిరుగుతూ ప్రజల్ని ఆశీర్వదించారు. క్రీస్తు​ విగ్రహానికి వైద్యుల దుస్తులు ధరించి, ప్రపంచ వ్యాప్తంగా వైరస్​తో పోరాడుతున్న వైద్య సిబ్బంది కోసం ప్రార్థనలు చేశారు. న్యూయార్క్​లోని ఓ చర్చిలో టెలివిజన్​ లైవ్​ ద్వారా క్రీస్తు​ పునర్జన్మపై బోధనలు చేయగా.. అక్కడి ప్రజలు టీవీల్లో విక్షీస్తూ వేడుకలు చేసుకున్నారు.

Easter blessings from above in Rio de janeiro
గాల్లో నుంచే 'ఈస్టర్​ సండే' ఆశీస్సులు

By

Published : Apr 13, 2020, 12:57 PM IST

Updated : Apr 13, 2020, 3:29 PM IST

హెలికాప్టర్​లో తిరుగుతూ చర్చి ఫాదర్​ ఆశీస్సులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. లాక్​డౌన్​తో పలు దేశాల్లో చర్చిలు మూసివేశారు. ఇళ్లలోనే 'ఈస్టర్​ సండే' వేడుకలను వినూత్న పద్ధతుల్లో జరుపుకున్నారు. రియో డి జెనిరోలో ఓ చర్చి ఫాదర్​ ఒమర్​ రపోసో.. హెలికాఫ్టర్​లో నగరమంతా తిరిగి ఆశ్వీరదించారు.

వైద్యుడిగా 'క్రీస్తు​'..

నగరంలోని కోర్కోవాడో కొండపై ఉన్న క్రీస్తు​ విగ్రహం వైద్యుల దుస్తులు ధరించినట్లు యానిమేషన్​ చేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనాపై పోరాటం చేయడానికి వైద్యుల రూపంలో క్రీస్తు వచ్చినట్లు ఈస్టర్​ సండేను జరపుకున్నారు. ఈ యానిమేషన్​లో 'ప్రజల ఇళ్లలో నుంచి బయటకు రావద్దని వైద్య సిబ్బంది కోరుతున్న' సందేశమిచ్చారు. చివరిగా పలు దేశాల జెండాలను కీస్తుకు ధరించి.. వినూత్నమైన భాషలో "ధన్యవాదాలు" తెలిపారు.

ఆన్​లైన్​ సందేశాలు

ప్రస్తుతం వైరస్​ కరాళ నృత్యం చేస్తున్న అమెరికా న్యూయార్క్​ నగరంలోని సెయింట్​ పాట్రిక్​ కేథడ్రల్​ చర్చిలో ఫాదర్​ ఒక్కరే ఈస్టర్​ సండే సందేశామిచ్చారు. అక్కడి ప్రజలు టీవీలో ఈ బోధనలు వీక్షీస్తూ వేడుకలు జరుపుకున్నారు.

ఇదీ చూడండి:కరోనా భయాలు బేఖాతరు- 'యుద్ధ' వ్యూహాల్లో కిమ్​ బిజీ!

Last Updated : Apr 13, 2020, 3:29 PM IST

ABOUT THE AUTHOR

...view details