తెలంగాణ

telangana

ETV Bharat / international

వరుస భూకంపాలతో అమెరికా గజగజ - భూకంపం

వరుసగా రెండోరోజు అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేల్​పై తీవ్రత 7.1గా నమోదైంది. గత రెండు దశాబ్దాల కాలంలో ఇదే అతిపెద్ద భూకంపం.

దక్షిణ కాలిఫోర్నియాలో మరోసారి భూకంపం

By

Published : Jul 6, 2019, 10:17 AM IST

Updated : Jul 6, 2019, 11:06 AM IST

దక్షిణ కాలిఫోర్నియాలో మరోసారి భూకంపం

అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా ప్రాంతంలో మారోసారి భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 8 గంటల 19 నిమిషాలకు భూమి కంపించింది. రిక్టర్​ స్కేల్​పై తీవ్రత 7.1గా నమోదైంది.

రెండు రోజుల్లో...

దక్షిణ కాలిఫోర్నియా ప్రాంతంలో భూకంపాల వల్ల రెండు రోజులుగా స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇదే ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి భూకంపం వచ్చింది. రిక్టర్​ స్కేల్​పై 6.4 తీవ్రత నమోదైంది. గత 20 ఏళ్లలోనే ఇదే అతిపెద్ద భూకంపమని అధికారులు ప్రకటించారు. తాజా భూకంపం ఆ లెక్కలను చెరిపేసింది.

ఇదీ చూడండి:- 'అచ్చం కపిల్​దేవ్​​ లాగే ఉన్నాడుగా'

Last Updated : Jul 6, 2019, 11:06 AM IST

ABOUT THE AUTHOR

...view details