Earthquake in US: అమెరికా ఉత్తర కాలిఫోర్నియా తీరంలో సోమవారం మధ్యాహ్నం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రత నమోదైంది. భూకంపం కారణంగా పెట్రోలియా పట్టణంలో భూమి తీవ్రంగా కంపించింది. షెల్వ్స్లోని వస్తువులు కిందపడ్డాయి. భయంతో జనం ఇళ్లు, కార్యాలయాలను వీడి బయటకు పరుగులు తీశారు.
Northern California earthquake: భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశం లేదని జాతీయ వాతావరణ సర్వీసు తెలిపింది. శాన్ ఫ్రాన్సిస్కోకు వాయవ్యంగా 210 మైళ్ల దూరంలో ఉన్న పెట్రోలియా పట్టణానికి కొద్ది దూరంలో ఈ భూకంపం కేంద్రం ఉన్నట్లు చెప్పింది.
భూప్రకంపనల కారణంగా పలు ప్రాంతాల్లో భవనాలు కంపించాయని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంపం కారణంగా 10 మిలియన్ డాలర్ల కంటే తక్కువ ఆస్తి నష్టమే జరిగి ఉంటుందని అంచనా వేసింది.