కొవిడ్-19 బారినపడిన గర్భిణులకు నెలలు నిండకుండానే కాన్పు అయ్యే ముప్పు చాలా ఎక్కువగా ఉంటుందని అమెరికాలో జరిగిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ వివరాలు 'ద లాన్సెట్ రీజినల్ హెల్త్'లో ప్రచురితమయ్యాయి. అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.
గర్భిణులకు కొవిడ్ సోకితే ముందే ప్రసవం!
కరోనా సోకిన గర్భిణులకు.. నెలలు నిండకుండానే కాన్పు అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. కొవిడ్-19తోపాటు అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలున్న గర్భిణులకు ఈ ముప్పు 160 శాతం అధికమని వెల్లడించారు.
గర్భిణులు, ప్రెగ్నెన్సీ
కరోనా సోకిన గర్భిణులకు.. గర్భం ధరించిన 32 వారాల లోపే కాన్పు అయ్యే అవకాశం 60 శాతం ఎక్కువని శాస్త్రవేత్తలు తెలిపారు. 37 వారాల లోపు ప్రసవం జరిగేందుకు 40 శాతం అవకాశం ఎక్కువగా ఉంటుందని వివరించారు. కొవిడ్-19తోపాటు అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలున్న గర్భిణులకు నెలలు నిండకుండా కాన్పు అయ్యే ముప్పు 160 శాతం ఎక్కువని పరిశోధనకు నాయకత్వం వహించిన డెబోరా కారాసెక్ తెలిపారు. గర్భిణులకు తప్పనిసరిగా టీకాలు వేయాలని కోరారు.