తెలంగాణ

telangana

ETV Bharat / international

డెల్టా పంజా- ప్రపంచదేశాల్లో మళ్లీ పెరుగుతున్న కేసులు - డెల్టా కేసులు

డెల్టా వేరియంట్​ వైరస్​.. క్రమంగా ప్రపంచ దేశాలపై పంజా విసురుతోంది. అమెరికాలో కొత్తగా రికార్డు స్థాయిలో 61,581 కేసులు నమోదయ్యాయి. ఇరాన్​లోనూ.. అత్యధికంగా 34,951 మందికి వైరస్ నిర్ధరణ అయింది.

delta variant
డెల్టా ఉద్ధృతి

By

Published : Jul 28, 2021, 9:58 AM IST

భారత్‌లో కరోనా రెండో దశలో విలయం సృష్టించిన డెల్టా వేరియంట్‌.. ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అమెరికాలో తాజాగా 61,581 కేసులు బయటపడ్డాయి. వైరస్​ బారిన పడి మరో 339 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇండోనేసియాలోనూ కేసులు ఒక్కసారిగా పెరిగాయి. కొత్తగా 45,203 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. మహమ్మారి కారణంగా మరో 2,069 మంది మరణించారు.

ఇరాన్​లో విజృంభణ..

కరోనా డెల్టా వేరియంట్ ఇరాన్‌పై విరుచుకుపడుతోంది. కొత్తగా రికార్డు స్థాయిలో 34,951 కేసులు, 357 మరణాలు నమోదయ్యాయి. డెల్టా వైరస్‌ వ్యాప్తి తీవ్రతను గుర్తించిన ఇరాన్‌ ప్రభుత్వం గత వారం జన సంచారంపై ఆంక్షలు విధించింది. కార్యాలయాలు, నిత్యావసరం కాని వ్యాపారాలు మూసివేయాలని ఆదేశించింది.

దక్షిణ కొరియాలోనూ.. రికార్డు స్థాయిలో ఒక్కరోజే 1,896 కేసులు నమోదయ్యాయి.

వైద్య నిపుణుల్లో ఆందోళన

అయితే ఆంక్షల విషయంలో కఠినంగా వ్యవహరించకుండా ప్రజల విచక్షణకే వదిలేయటం వల్ల.. టెహ్రాన్‌లో జనసమ్మర్దం మునుపటిలాగే కొనసాగుతోంది. షాపింగ్‌ మాల్స్‌, మార్కెట్లు, మెట్రో స్టేషన్లు జనంతో కిటకిటలాడుతున్నాయి. ఈ పరిస్థితిపై వైద్య నిపుణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. శ్వాస సమస్యలతో వస్తున్న వారితో ఆస్పత్రులన్నీ నిండిపోయాయి. ఇదే పరిస్థితి కొనసాగితే కొన్ని రోజుల్లోనే పరిస్థితి చేయి దాటిపోతుందని వారు హెచ్చరిస్తున్నారు.

వివిధ దేశాల్లో నమోదైన కొత్త కేసులు..

  • అమెరికా-- 61,581
  • ఇండోనేసియా-- 45,203
  • బ్రెజిల్​-- 41,411
  • ఇరాన్​-- 34,951
  • స్పెయిన్-- 26,399

ఇవీ చదవండి:Covishield Vaccine: 'కొవిషీల్డ్ టీకాతో 93 శాతం రక్షణ'

యాంటీబాడీలు తగ్గుతున్నా.. వైరస్‌ నుంచి రక్షణ!

ఎన్ని కరోనాలున్నా.. ఒకటే మందు

ABOUT THE AUTHOR

...view details