తెలంగాణ

telangana

ETV Bharat / international

మార్పిడి కోసం డ్రోన్​లో కిడ్నీ తరలింపు - కిడ్నీ మార్పిడి

డ్రోన్​ సాయంతో కిడ్నీని తరలించి విజయవంతంగా ఓ వ్యక్తికి అమర్చారు అమెరికాలోని మేరీల్యాండ్ విశ్వవిద్యాలయం వైద్యులు. ప్రపంచంలోనే మొదటిసారిగా దాత నుంచి సేకరించిన అవయవాన్ని డ్రోన్​ ద్వారా తరలించారు.

మార్పిడి కోసం డ్రోన్​లో కిడ్నీ తరలింపు

By

Published : May 3, 2019, 8:11 PM IST

మార్పిడి కోసం డ్రోన్​లో కిడ్నీ తరలింపు

అమెరికా బాల్టిమోర్​లోని మేరీల్యాండ్​ వైద్య విశ్వవిద్యాలయం అరుదైన ఘనత సాధించింది. అవయవ మార్పిడి కోసం మొదటిసారిగా డ్రోన్​ను ఉపయోగించారు. అనంతరం విజయవంతంగా శస్త్రచికిత్స చేసి రికార్డు సృష్టించారు.

బాల్టిమోర్​లోని ట్రినా గ్లిస్పీ ఎనిమిదేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. డయాలసిస్​ సాయంతోనే కాలం వెళ్లదీస్తున్నారు. పరిస్థితి విషమించటం వల్ల కిడ్నీ మార్పిడి అత్యవసరమయింది. ఫలితంగా దాత నుంచి సేకరించిన కిడ్నీని సుమారు పది నిమిషాల్లో తీసుకురావాల్సి ఉంటుంది. ఇందుకు డ్రోన్​ ఉపయోగించి విజయవంతమయ్యారు వైద్యులు.

"ఛార్టర్​​​ విమానాలు ఉపయోగిస్తే ఖర్చు అధికంగా అవుతుంది. మనకు చాలా సాంకేతికత అందుబాటులో ఉంది. అది ఇందుకు ఉపయోగించాలని చూశాం. ఉన్నవాటిని అనుగుణంగా వాడుకుని సౌకర్యవంతంగా అవయవ మార్పిడి చేయగలిగాం."
- స్కేలియా, వైద్యులు

ఇదీ చూడండి:వరదలు, టోర్నడోలతో అమెరికా గజగజ

ABOUT THE AUTHOR

...view details