తెలంగాణ

telangana

ETV Bharat / international

అధ్యక్ష ఎన్నికల వేళ డా. ఫౌచీ కీలక వ్యాఖ్యలు - ఫౌచీ వైరస్​ కరోనా

ప్రజా ఆరోగ్య విధానాల్లో అమెరికా మార్పులు తీసుకురావాలని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంథోని ఫౌచీ అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో దేశంలో రోజుకు లక్ష వరకు కరోనా కేసులు వచ్చే అవకాశం ఉందని ఫౌచీ హెచ్చరించారు.

Dr Fauci
అధ్యక్ష ఎన్నికల వేళ డా. ఫౌచీ కీలక వ్యాఖ్యలు

By

Published : Nov 2, 2020, 5:31 AM IST

అమెరికాలో కరోనా కేసులు పెరుగుతుండటంపై ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌచీ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కేసుల సంఖ్య పెరుగుదలపై ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఫౌచీ. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరును తప్పుబట్టారు.

రానున్న రోజుల్లో రోజుకు లక్ష కేసుల వరకూ నమోదయ్యే ప్రమాదం ఉందన్నారు ఫౌచీ. ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్యతో పాటు మరణాలు సైతం పెరుగుతున్నట్లు చెప్పారు.

ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని ఫౌచీ అన్నారు. ప్రజా ఆరోగ్య విధానాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరముందని ఫౌచీ అభిప్రాయపడ్డారు. అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భౌతిక దూరం పాటించకుండా, ట్రంప్ ర్యాలీలు నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details