మనౌస్.. కరోనా వైరస్‌తో అతలాకుతలమవుతున్న బ్రెజిల్ దేశంలోని ఓ నగరం. ఈ అమెజోనస్ రాష్ట్ర రాజధానిలో రోజు రోజుకు కరోనా మరణాలు పెరిపోతున్నాయి. అందువల్ల పబ్లిక్ సిమెట్రీల(శ్మశానవాటికలు)ను తెరిచింది అక్కడి ప్రభుత్వం. తెరిచిన ఒక్క రోజుకే మృతదేహాలు కుప్పలుకుప్పలుగా వచ్చి చేరాయి. బంధువులు, మిత్రుల కన్నీటి వీడ్కోలు మధ్య వాటిని ఖననం చేశారు.
అధికార గణాంకాల ప్రకారం... రోజుకు సగటున 30 మృతదేహాలను ఖననం చేస్తారు. కానీ కరోనా విజృంభణ వల్ల ఆ సంఖ్య 100కు చేరింది. రాష్ట్రంలోని 80శాతం కేసులు మనౌస్ నుంచే ఉండటం కూడా ఇందుకు ఓ కారణం.