తెలంగాణ

telangana

ETV Bharat / international

బైడెన్​ ప్రమాణ స్వీకారానికి ట్రంప్​ వెళతారా?

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్​ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దూరంగా ఉంటారా అనే ప్రశ్నకు జవాబిచ్చేందుకు నిరాకరించారు ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. దాని గురించి మాట్లాడాలనుకోవట్లేదని ఓ న్యూస్​ ఛానెల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. దేశ చరిత్రలోనే అధ్యక్షులందరి కన్నా అత్యధిక ఓట్లు సాధించానని పునరుద్ఘాటించారు.

By

Published : Dec 14, 2020, 4:27 PM IST

Donald trump
అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్

అమెరికా కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్​ ప్రమాణ స్వీకారోత్సవానికి దూరంగా ఉంటారా? అనే ప్రశ్నకు జవాబు ఇచ్చేందుకు నిరాకరించారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​. ఫాక్స్​ న్యూస్​​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'దాని గురించి మాట్లాడాలనుకోవట్లేదు' అని స్పష్టం చేశారు. ఈ అంశానికి బదులుగా ఎన్నికల్లో తాను అత్యధికంగా ఓట్లు సాధించానని, తానే విజయం సాధించానని పునరుద్ఘాటించారు ట్రంప్​.

" మేం గొప్పగా పని చేసామన్నదాని గురించి మాట్లాడాలనుకుంటున్నా. దేశ చరిత్రలోనే అధ్యక్షులందరికన్నా అత్యధికంగా ఓట్లు సాధించాను. అది చాలా దగ్గరి సంఖ్య కూడా కాదు. ఒబామా కన్నా 75 మిలియన్లు ఎక్కువ. మేము ఎన్నికల్లో ఓడినట్లు వారు చెప్పారు. మేము ఓడిపోలేదు."

- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

బైడెన్​ ప్రమాణ స్వీకారోత్సవ సమయానికి ట్రంప్​ తన ఓటమిని అంగీకరించకపోతే తలెత్తే పరిస్థితుల గురించి మాట్లాడగా.. " దేశానికి చట్టవిరుద్ధమైన అధ్యక్షుడు ఉండటం గురించి ఆందోళన చెందుతున్నా. ఆయన ఘోరంగా ఓటమిపాలైన అధ్యక్షుడు. ఇది హోరాహోరీగా సాగిన ఎన్నిక కాదు. జార్జియాలో చూస్తే.. అక్కడ మేమే గొప్పగా గెలిచాం. పెన్సిల్వేనియా, విస్కాన్సిన్​ వంటి రాష్ట్రాల్లో భారీ ఓట్లతో గెలిచాం. " అని పేర్కొన్నారు ట్రంప్​.

కీలక రాష్ట్రాల్లో ఎన్నికలను రద్దు చేయాలని కోరుతూ టెక్సాస్​ అటార్నీ జనరల్​ దాఖలు చేసిన పిటిషన్​ను గత శుక్రవారం కొట్టివేసింది ఆ దేశ సుప్రీం కోర్టు. ఈ క్రమంలో ట్రంప్​కు ఉన్న చివరి అవకాశానికి తెరపడినట్లయింది.

ఇదీ చూడండి: అగ్రరాజ్య పోరులో నేడు మరో కీలక ఘట్టం

ABOUT THE AUTHOR

...view details