అమెరికా అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడాలని తాను కోరుకోవడం లేదని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అయితే మెయిల్-ఇన్ ఓటింగ్ లెక్కింపు మాత్రం కొన్ని వారాల సమయం పట్టొచ్చని, దీని వల్ల ఫలితాల్లో అవకతవకలు జరగొచ్చని పేర్కొన్నారు. నవంబర్ 3న జరగనున్న ఎన్నికలు కాస్త ఆలస్యంగా జరగొచ్చన్న తన ట్వీట్‌పై రాజకీయ దుమారం చెలరేగడం వల్ల ఈ మేరకు వ్యాఖ్యానించారు ట్రంప్.
"ఎన్నికలను వాయిదా వేయాలని నాకు లేదు. ఎన్నికలు జరగాలని నాకూ ఉంది. అదే సమయంలో మూడు నెలలు వేచిచూసి.. బ్యాలెట్లు కనపడటం లేదని తెలుసుకోవాలని నాకు లేదు."
--- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు.
మెయిల్-ఇన్ ఓటింగ్‌లో అవకతవకలు జరగవచ్చని ట్రంప్ ఆరోపిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో విదేశీ శక్తులు జోక్యం చేసుకోవడానికి ఇదొక సులభమైన మార్గమని అభిప్రాయపడ్డారు.