ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంథోని ఫౌచీ అమెరికా ప్రజలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా టీకా అందరికీ అందుబాటులోకి వచ్చినా కొవిడ్-19 నిబంధనలు, భౌతిక దూరం, మాస్కులు ధరించటం మానేయవద్దని కోరారు. నిబంధనలు పాటిస్తే ఇంకాస్త జాగ్రత్తగా ఉండొచ్చని సూచించారు. ప్రస్తుతం అమెరికా మొత్తం ఆరు టీకాలను అభివృద్ధి చేస్తోంది. ఇందులో ఫైజర్ ఫార్మా కంపెనీ తయారు చేస్తోన్న టీకా ఇప్పటికే 90 శాతం కచ్చితత్వంతో పనిచేస్తుంది. ఈ వ్యాక్సిన్ తుది దశ ఫలితాలు నవంబరు మూడో వారంలో వెలువడనున్నాయి. తాజాగా మోడెర్నా టీకా సైతం 94.5% సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు సంస్థ తెలిపింది.
'వ్యాక్సిన్ వచ్చినా కొవిడ్ నిబంధనలు మానొద్దు' - fauci on social distancing norms
కరోనా వ్యాక్సిన్ వేసుకున్నా మాస్కులు ధరించటం, భౌతికదూరం పాటించటం ఆపొద్దని ప్రముఖ అంటు వ్యాధుల నిపుణుడు ఆంథోని ఫౌచీ అమెరికా ప్రజలను కోరారు. టీకా అందుబాటులోకి వచ్చాక ప్రజలు మునుపటి జీవితాన్ని గడపుతారా? అని ఓ టీవీ ఛానెల్ అడిగిన ప్రశ్నకు ఫౌచీ ఈ మేరకు స్పందించారు.
!['వ్యాక్సిన్ వచ్చినా కొవిడ్ నిబంధనలు మానొద్దు' Don't abandon masks, social distancing after getting vaccine: Fauci](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9562267-652-9562267-1605534277105.jpg)
'వ్యాక్సిన్ వచ్చినా కొవిడ్ నిబంధనలను మానొద్దు'
అమెరికాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. జాన్స్ హోప్కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపిన లెక్కల ప్రకారం సోమవారం నాటికి అగ్రరాజ్యంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య కోటీ 10 లక్షలు దాటింది. మరణాల సంఖ్య 2లక్షల 46వేల129గా ఉంది.