కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు తమ శాయశక్తులా కృషి చేస్తున్నారు వైద్యులు. వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పుడు వైద్య సిబ్బంది సేవలను ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు. కాలిఫోర్నియాలోని సాంటా క్రూజ్‌లో ఓ అజ్ఞాతవ్యక్తి మాత్రం వైద్యసిబ్బందికి ఏదైనా కానుక ఇవ్వాలనుకున్నాడు. స్థానిక ఆస్పత్రికి ఒక మిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చాడు.
'దేశ ప్రజల క్షేమం కోసం మీరు చేస్తున్న సేవలకు ధన్యవాదాలు' అని విరాళంతో పాటు ఓ నోట్‌ను ఉంచారు గుర్తు తెలియని వ్యక్తి. అహర్నిశలు శ్రమిస్తున్న తమకు మానవతా దృక్పథంలో ఆ వ్యక్తి చేసిన సాయం సంతోషాన్నిస్తోందని ఆస్పత్రి సిబ్బంది చెప్పారు.