అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను అభిశంసించే తీర్మానం మంగళవారం(స్థానిక కాలమానం) సెనేట్ ముందుకు వచ్చింది. చట్టసభల నిలయమైన క్యాపిటల్ హిల్ భవనంపై జనవరి 6న దాడి జరిగేలా తన మద్దతుదార్లను రెచ్చగొట్టారన్నది ట్రంప్‌పై ఉన్న ఆరోపణ.
ఓ మాజీ అధ్యక్షుడు అభిశంసన ఎదుర్కొనడం.. అమెరికా చరిత్రలోనే తొలిసారి. మొత్తం మీద ట్రంప్ అభిశంసనను ఎదుర్కొనడం ఇది రెండోసారి.
అభిశంసనకు సంబంధించిన తీర్మానం గత నెలలో ప్రతనిధుల సభలో గట్టెక్కింది. అయితే ప్రతినిధుల సభకు కేవలం అభిశంసించే అధికారం ఉండగా.. సెనేట్‌కు విచారణ జరిపి, శిక్ష విధించే అధికారం కూడా ఉంది.
క్యాపిటల్‌పై దాడిని ట్రంప్ సొంతపార్టీ అయిన రిపబ్లికన్ సభ్యులు అప్పట్లో ఖండించగా, ప్రస్తుతం వారు మెత్తపడ్డారు. పదవి నుంచి దిగిపోయినందున మళ్లీ శిక్ష ఎందుకున్న భావన వారిలో ఉన్నారు. ఈ తరుణంలో ట్రంప్ అభిశంసన కథ ఎక్కడికి చేరుతుందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇదీ చూడండి:-ట్రంప్‌కు ఆ విషయాలు చెప్పబోం: బైడెన్