అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్ల విషయంలో అమెరికా అనుసరిస్తున్న విధానాన్ని తప్పుపట్టారు మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. తాలిబన్లు అఫ్గాన్‌లోని నగరాలను, ప్రావిన్సులను స్వాధీనం చేసుకోవడంపై స్పందించిన ఆయన.. ఈ విషయంలో అధ్యక్షుడు జో బైడెన్ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.
"ఇప్పటివరకు అమెరికా మీద ఉన్న భయం, గౌరవం ఇకపై తాలిబన్లకు ఉండవు. కాబూల్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై తాలిబన్లు వారి జెండా ఎగరవేస్తారు. అదే జరిగితే ఆ ఘటన అమెరికాకు ఏంతో అవమానకరం. అది కచ్చితంగా అమెరికా వైఫల్యంగా పరిగణించాలి. బలహీనత, అసమర్థతకు అద్దం పడుతోంది."
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా మాజీ అధ్యక్షుడు
అఫ్గానిస్థాన్‌లో 5 వేల మంది అమెరికా బలగాలను మోహరిస్తున్నాట్లు అధ్యక్షుడు జోబైడెన్ తెలిపిన కొన్ని గంటల్లోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. విదేశాంగ విధానం, ఇతర సమస్యలపై బిడెన్ ప్రతిసారీ తప్పు చేస్తారని అన్నారు.