నవంబరు 3న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. 'పోల్ నంబర్లు చాలా బలంగా ఉన్నాయి. పెద్ద సమూహాలు, గొప్ప ఉత్సాహం, భారీ రెడ్ వేవ్ వస్తోంది!' అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. కరోనా వైరస్ నుంచి కోలుకొని తిరిగి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఆయన తాజాగా ట్విటర్‌లో ఆశాభావం వ్యక్తం చేశారు. 'మనం రెడ్ వేవ్‌ను చూడబోతున్నాం. మన ప్రజలు వెళ్లి, ఓటు వేయాలనుకుంటున్నారు. ఇది పెద్ద, అందమైన రెడ్ వేవ్ కానుంది' అంటూ నార్త్ కరోలినాలో తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసగించారు.
భారీ రెడ్ వేవ్ సమీపిస్తోంది: ట్రంప్ - అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020
రానున్న అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. నార్త్ కరోలినాలో తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసగించారు ట్రంప్.
అమెరికాలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్నప్పటికీ, భౌతిక దూరం నిబంధనలను పాటించకుండా ప్రజలు భారీగా ఎన్నికల ర్యాలీలకు హాజరవుతున్నారు. మరోవైపు, ఇప్పటి వరకు జరిపిన పలు సర్వేల్లో ట్రంప్ కంటే బైడెన్ రేసులో ముందున్నట్లు సమాచారం. నీల్సన్ కంపెనీ వివరాల ప్రకారం..గురువారం ఏబీసీలో ప్రసారమైన 90 నిమిషాల బైడెన్ చర్చా కార్యక్రమాన్ని 14.1మిలియన్ల మంది వీక్షించగా.. ఎన్‌బీసీ, సీఎన్‌బీసీ, ఎంఎస్‌బీసీ ఛానళ్లలో ప్రసారమైన ట్రంప్ 60 నిమిషాల చర్చా కార్యక్రమాన్ని 13.5 మిలియన్ల మంది చూశారు.
ఇదీ చూడండి: అధ్యక్ష పోరు: కీలక సమస్యలపై ట్రంప్-బైడెన్ వైఖరేంటి ?