తెలంగాణ

telangana

ETV Bharat / international

అధ్యక్ష బాధ్యతలు ట్రంప్​ వల్లకాని విషయం: ఒబామా

అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఏమీ చేయలేకపోయారని.. ఎందుకంటే అది ఆయన వల్లకాని విషయమని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా విమర్శించారు. ట్రంప్​ చేసిన నష్టం నుంచి అమెరికన్లను బయటపడేయగలిగేది.. జో బైడెన్ మాత్రమేనని ఓటర్లకు సూచించారు.

Donald Trump hasn't grown into the job because he can't: Obama
అధ్యక్ష బాధ్యతలు ట్రంప్​ వల్లకాని విషయం: ఒబామా

By

Published : Aug 20, 2020, 4:54 PM IST

అమెరికాకు అధ్యక్షత వహించడం డొనాల్డ్​ ట్రంప్​ వల్ల కాని విషయమని మాజీ అధ్యక్షుడు బరాక్​ ఒబామా విమర్శించారు. అందుకే అధ్యక్షుడిగా ట్రంప్​ ఏమీ చేయలేకపోయారని పేర్కొన్నారు. డెమొక్రటిక్ పార్టీ జాతీయ సదస్సులో భాగంగా ట్రంప్‌పై ఒబామా తీవ్రవిమర్శలు చేశారు. అమెరికా అధ్యక్ష పదవికి డొనాల్డ్ ట్రంప్ అనర్హుడని.. అమెరికా మంచి కోసం గతంలో తన హయాంలో ఉపాధ్యక్షుడిగా పనిచేసిన జో బైడెన్‌కు దేశప్రజలు అవకాశం ఇవ్వాలని బరాక్ విజ్ఞప్తి చేశారు.

నాలుగేళ్ల పాలనలో అధ్యక్ష విధులను సక్రమంగా నిర్వహించడంపై ట్రంప్‌కు ఏనాడూ ధ్యాస లేదని ఒబామా అన్నారు. క్షేత్రస్థాయి సమస్యలపై అవగాహన పెంచుకునేందుకు కూడా ఆయన ఏ విధమైన ప్రయత్నం చేయలేదని దుయ్యబట్టారు. తన పదవికున్న అపరిమితమైన అధికారాలు.. ప్రజల బాగోగుల కోసం కాకుండా కేవలం తన కోసం, తన వారికోసం మాత్రమే ట్రంప్ వాడారని బరాక్ విమర్శించారు. అధ్యక్ష స్థానాన్ని ఇంకో రియాల్టీ షోగా చూపడం మినహా ట్రంప్​ ఏమీ చేయలేకపోయారని ధ్వజమెత్తారు. ట్రంప్ చేతకానితనం కారణంగా.. వ్యవస్థలన్నీ అస్తవ్యస్థమై అమెరికన్లు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటున్నారని ఒబామా అన్నారు.

కరోనా విషయంలో ట్రంప్ వైఫల్యం కారణంగా..లక్షా 70 వేల మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోయారని.. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారని ఒబామా ధ్వజమెత్తారు. ఈ పరిస్థితుల నుంచి అమెరికన్లను బయటపడేయగలిగేది.. కేవలం జోబైడెన్ మాత్రమేనని ఒబామా పేర్కొన్నారు.

ఇదీ చూడండి:-

ABOUT THE AUTHOR

...view details