భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతిపట్ల సంతాపం ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో. ముఖర్జీని గొప్పనేతగా అభివర్ణించారు. ప్రణబ్ దూరదృష్టి నాయకత్వం భారత్.. ప్రపంచ శక్తిగా ఎదిగేందుకు సాయపడిందని పేర్కొన్నారు. అదే అమెరికా-భారత్ దృఢమైన బందానికి పునాది వేసిందని గుర్తు చేసుకున్నారు.
''భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణ వార్తతో దిగ్ర్భాంతికి గురయ్యా. ఆయన కుటుంబ సభ్యులు, భారత ప్రజలకు నా ప్రగాఢ సానుభూతి.''