కరోనా వైరస్ చైనాలోనే పుట్టిందని గతంలో పలుమార్లు ఆరోపించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మరోసారి అదే విషయాన్ని పునరుద్ఘాటించారు. చైనాలో పుట్టిన వైరస్‌ను అమెరికన్లు దేశం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
కరోనాపై పోరాటం చేస్తున్న వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య, పోలీసు, అగ్నిమాపక సిబ్బందితో ముచ్చటించిన ట్రంప్.. వారి సేవలను ప్రశంసించారు. ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న వారందరికీ తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు ట్రంప్.