కరడు గట్టిన ఉగ్రసంస్థ- ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా అధినేత అబు బకర్ అల్ బాగ్దాదీని చివరి వరకు వెంటాడి వేటాడిన వీర శునకం.. శ్వేతసౌధాన్ని సందర్శించింది. స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ శునకం కోనన్ను ప్రపంచానికి పరిచయం చేశారు. కోనన్కు 'మెడల్ ఆఫ్ హానర్' అనే ప్రత్యేక అవార్డును కూడా అందించిన్నట్లు ట్రంప్ తెలిపారు. ఈ జాగిలాన్ని అమెరికన్ హీరోగా అభివర్ణించారు.
"ఈ శునకం అద్భుతం. చాలా చురుకైనది, తెలివైనది. సైన్యం, జాగిలం కలిసి గొప్పగా పనిచేశారు. మరికొంత కాలం పాటు కోనన్ సైనిక దళానికి తన సేవలను అందిస్తుంది."